ఆర్థరైటిస్ మందు కూడా కరోనా పేషంట్స్ కు వాడవచ్చునట!
posted on Apr 29, 2020 @ 12:37PM
ఆర్ధరైటిస్ చికిత్సకు వాడే TOCILIZUMAB ను క్లిష్ట పరిస్ధితులలో ఆస్పత్రిలో ఇబ్బంది పడుతున్న covid రోగులకు వాడవచ్చునట. ఫ్రాన్స్ లో నిర్వహించిన ట్రయల్స్ లో ఈ విషయం ఇంచుమించుగా నిర్ధారణ అయినట్టే.ఇది పక్కా చికిత్స కాకపోయినా ప్రాణనష్టాన్ని నివారించేందుకు,,ఆపై ఆస్పత్రులపై భారం తగ్గించేందుకు ఇది ప్రత్యామ్నాయంగా పనికి వస్తుంది.ఫ్రాన్స్ లో 129 మంది తీవ్ర రోగులలో సగం మందికి ఇంజక్షన్ చేయగా మంచి గుణమే కనిపించింది ..ఈ మందు ACTEMERA,రో ACEMETRA పేర్లతో
ప్రాచుర్యం పొందింది...
భారతీయులకు BCG, సూర్యరశ్మి వరాలే
భారత దేశంలో పౌరులందరికీ BCG వాక్సిన్ ఉంటుంది గనుక కరోనా నియంత్రణలో భారతీయులు దృఢంగా ఉన్నారని అమెరికాలో స్థిరపడిన భారతీయనిపుణుడు రవి గాడ్సే అభిప్రాయపడ్డారు.అలాగే ఇండియాలో ఇప్పటికే మొదలైన ప్లాస్మా థెరపీ కూడా సత్ఫలితాలు ఇస్తుందని ఆయన చెప్పారు.కాకపోతే covid వచ్చి తగ్గిన వారి నుంచి కాక అసలు ఆ జబ్బు రాని ఆరోగ్యవంతుల రక్తం నుంచి రెండు మూడు వారాల ముందే సేకరించే కణాలను చికిత్సకు వాడే అంశాన్ని పరిశీలించాలని ఆయన సూచించారు.
ఇక భారత్ లో వాతావరణ పరిస్థితుల గురించి మాట్లాడుతూ సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలలో వైరస్ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందని రవి అభిప్రాయపడ్డారు.తేమ ఎక్కువగా ఉండేటప్పుడు మనిషి నుంచి వెలువడే తుప్పర్లలో అధిక శాతం తొందరగా భూమిపై పడి ప్రభావం కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు.వాతావరణ పరిస్థితులతో పాటు భారత ప్రభుత్వం ముందుగా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం,అది అమలు జరుగుతున్న విధానం మేలు చేసి ఇండియా మూడో దశకు వెళ్లే ప్రమాదం నుంచి బయటపడినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు..ఇప్పుడు అమెరికా తెరిపిన పడుతోంది గనక రానున్న రోజుల్లో భారత్ లో కొన్ని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా HCQ విషయంలో ఇండియా చేసిన సాయానికి కృతజ్ఞతగా USA ఖచ్చితంగా రుణం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుందని చెప్పారు.
ఒకసారి వచ్చి తగ్గిన వారికి అంత త్వరగా రోగం తిరగబెట్టే అవకాశాలు తక్కువేనని రవి అన్నారు.అలాగే కరోనా స్వభావం మార్చుకునే అవకాశాలు ఉన్నప్పటికీ అది మంచికే దారి తీస్తుందని ఆశించవచ్చన్నారు.ఈలోగా వాక్సిన్ కూడా సిద్ధం అవుతుందనే సానుకూల అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చునని పేర్కొన్నారు.కాగా లక్షణాలు కనిపించే వారిని క్వారెంటైన్ కు పంపుతూ ఇమ్యూనిటీ పరీక్షలు జరిపి ఫిట్ అయిన వారిని రంగంలోకి దింపి ఆర్థిక పునర్నిర్మాణం దిశగా భారత్ వడివడిగా అడుగులు వేయవచ్చని ఆయన చెప్పారు.ఏదిఏమైనా కరోనా బారిన ఎందరు పడినా 90 శాతం మందిపై అది పెద్దగా ప్రభావం చూపదని,అయిదు శాతం మంది ఖచ్చితంగా కోలుకుంటారని ఆయన స్పష్టం చేశారు.