Read more!

అనుకున్న పనులలో విజయం సాధించాలనే ఆరాటం ఉందా? అయితే ఈ పనులు చేయండి!

జీవితంలో ఓడిపోవాలని ఎవరూ అనుకోరు. మూర్ఖుడు కూడా విజయం గురించే ఆలోచిస్తాడు. తెలివైన వారు కూడా విజయం ఎలా సాధించాలనే విషయాలపై తర్జభర్జన పడుతుంటారు. అయితే తెలివైనవారు విజయానికి మార్గాలు కనుగొనడంలో ఎప్పుడూ తలమునకలై ఉంటారు. కానీ మూర్ఖులు మాత్రం విజయం వాకిట్లో ఉన్నా మళ్లీ చూద్దాం అనుకుంటారు. మరికొందరు విజయం సాధించాలనే తపన ఉన్నా సరే..  తమ వల్ల కావట్లేదని నిరుత్సాహ పడతారు. అయితే జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలంటే కింద చెప్పుకున్న నాలుగు విషయాలు త ప్పకుండా గుర్తుంచుకోవాలని అంటున్నారు. ఇంతకీ ఆ నాలుగు విషయాలు ఏంటో ఒకసారి తెలుసుకుంటే..

క్రమశిక్షణ..

వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణ మొట్టమొదటి మెట్టు.  క్రమశిక్షణ ఉంటే ఎప్పటిపనులు అప్పుడు పూర్తిచేయడం, ఏ సమయంలో ఏ పనులు చేయాలో, ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సమయపాలన క్రమశిక్షణ ద్వారానే సాధ్యం. కాబట్టి క్రమశిక్షణ బాగుంటే  విజయం సాధించడంలో మొదటి అడుగు సక్సెస్ గా ముందుకు వేసినట్టే..

సానుకూల దృక్పథం..

సానుకూలంగా ఉండటం అనేది విజయం సాధించడానికి రెండవ మెట్టు. సానుకూలత అనేది వ్యక్తిలో సబ్ కాన్సియస్ మైండ్ ను శక్తివంతంగా మారుస్తుంది. మన మెదడును పాజటివ్ గా విజయానికి సంసిద్దం చేస్తే.. ఎంత ఆటంకాలు ఉన్నా సరే విజయం సాధించేలా మనల్ని ముందుకు నడిపిస్తుంది. అంతేకాదు.. పాజిటివ్ ఆలోచన అనేది ఒత్తిడి నుండి దూరంగా ఉంచుతుంది.

నైతిక విలువలు..

నైతిక  విలువలు విజయానికి మరొక మెట్టు లాంటివి. నైతిక విలువలు ఉన్నవారు సమాజం చేత గౌరవించడబడతారు. నైతిక విలువలతో కూడిన జీవితంలో వ్యక్తి ఎప్పుుడూ తప్పు పనులు చేయడు. నిజాయితీగా కష్టపడేవాడికి ఖచ్చితంగా ఫలితం లభించి తీరుతుంది. పైగా అడ్డదారులలో సాధించే విజయాలలా కేవలం ఊరించి తరువాత చేజారిపోయే రకం కాదు. కాబట్టి నైతిక విలువలు ఉంటే విజయానికి సగం మార్గం సుగమమైనట్టే..

నేర్చుకోవడం..

ఎవరు ఏది చెప్పినా వినాలి. అందులో ఉపయోగపడే విషయాలను స్వీకరించాలి. ప్రయత్నాలలో వైఫల్యాలు ఎదురైతే వాటిని అనుభవ పాఠాలుగా తీసుకోవాలి. మరొకసారి అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. మరీ ముఖ్యంగా మొదటిసారే విజయం సాధించాలనే ఆలోచనను వదలాలి. విఫలమైన ప్రతిసారి  మరింత నేర్చుకోవడానికి అవకాశం దొరికిందనే సానుకూల భావంతో ఉండాలి. ఇవన్నీ ఫాలో అయితే విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు.

                                                *నిశ్శబ్ద.