ఆ ఇల్లు నిజంగానే బంగారం!
posted on Dec 19, 2022 9:18AM
ఏదైనా మంచి పని చేస్తే నీ ఇల్లు బంగారం గానూ అంటారు. అంటు భోగభాగ్యాలతో తులతూగమని ఆశీర్వాదం. అంతే కానీ నిజంగా ఇల్లంతా బంగారం అయిపోతుందని కాదు. కానీ ఓ భవనాన్ని మాత్రం మొత్తం బంగారంతో నిర్మించేశారు. ఇందుకు సంబంధించిన వార్తలు, ఫొటోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఈ బంగారంతో నిర్మించిన భవంతి ఎక్కడుందయ్యా అంటే వియత్నాంలో. ఎంగ్యూయెన్ వాన్ ట్రుంగ్ అనే రియల్టర్ ఈ భవనాన్ని వియత్నాలోని కాన్తో నగరంలో నిర్మించాడు. ఇంటు గోడల నుంచి పై కప్పు వరకూ పూర్తిగా బంగారంతో తాపడం చేయించాడు, అలాగే ఇంటిని కూడా బంగారు వస్తువులతో నిర్మించేశాడు.
ఇప్పుడు ఇదో బ్రహ్మాండమైన టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. పూర్తిగా బంగారంతో నిర్మించిన ఇంటిని చూసి తరించాలని ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఇప్పుడు కాన్తో నగరానికి క్యూ కడుతున్నారు. ప్రపంచంలోనే పూర్తిగా బంగారంతో నిర్మించిన భవనం బహుశా ఇది ఒక్కటే అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టూరిస్టులను ఆకర్షించడానికి బంగారు భవంతిని నిర్మించడమేమిటని ఆశ్చర్య పోతున్నారు.