పెళ్లిని క్యాన్సిల్ చేసిన షాంపూ
posted on Dec 19, 2022 @ 9:36AM
పెళ్లిళ్లు రద్దు కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో చిన్న చిన్న కారణాలతో కూడా పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. పీటల వరకూ వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోవడానికి వివాహ విందులో చికెన్ లేదనీ, వరుడి ముక్కు చిన్నగా ఉందనీ, పెళ్లిలో స్వీట్ తినడానికి వధువు నిరాకరించిందనీ ఇలా అతి చిన్న చిన్న విషయాలు కూడా కారణం అవ్వడం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువ అయ్యింది.
అయితే వీటన్నిటినీ మించిన సిల్లీ కారణంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయిన ఘటన అసోంలో జరిగింది. అన్నీ కుదిరి పెళ్లికి ముహూర్తం కూడ పెట్టేసుకున్న తరువాత అతి చిన్న కారణంతో పెళ్లి ఆగిపోయిన ఘటన అసోంలో ఇంతకీ ఆ సిల్లీ కారణం షాంపూ. ఔను షాంపూ కారణంగా పెళ్లి నిలిచిపోయింది. ఇంతకీ జరిగిందేమిటంటే హౌలీకి చెందిన అమ్మాయికి అసోంకు చెందిన అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. వరుడు ఇంజనీర్. అక్కడి సంప్రదాయం ప్రకారం వరుడి కుటుంబం అమ్మాయి పెళ్లి అలంకరణకు కావలసిన వస్తువులు పంపాలి.
ఆ అబ్బాయి తరఫు వారు అలాగే పంపారు. అయితే ఆ పంపిన వస్తువులలో షాంపూ కారణంగా అన్నీ కుదిరి పీటల వరకూ వచ్చిన పెళ్లి ఆగిపోయింది. ఇంతకీ ఆ షాంపూ కారణమేమిటో తెలుసా... అబ్బాయి తరఫు వారు పంపిన వస్తువుల్లో ఉన్నషాంపూ ఒకింత చవకదట.
దీంతో వధువుకు ఒళ్లు మండింది. వెంటనే ఇంజనీరింగ్ చదివారు ఇంత చవక రకం షాంపూ పంపుతారా? ఇదేనా మీ స్థాయి అంటూ మెసేజ్ పంపింది. దీంతో వరుడికి మనిషికి రావలసినంత కోపమూ వచ్చింది. వెంటనే పెళ్లి క్యాన్సిల్ అనేశాడు. వరుడిపైపు వారూ, వధువు వైపు వారూ ఎంత చెప్పినా వినలేదు.