ఇంగ్లీష్ మీడియం పై జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం
posted on May 21, 2020 @ 4:20PM
ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలనే కృత నిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ఉంది. తాజాగా దీనికి సంబంధించి జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్ మీడియం అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వేను ఒక ప్రముఖ థర్డ్ పార్టీ సంస్థతో చేయించాలని చేయించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతను ఓ ఇంగ్లీష్ ఛానల్ కు అప్పగించింది. సమగ్ర శిక్షణా అభియాన్ కింద షార్ట్ ఫిల్మ్‌లతో పాటు సర్వే చేయించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.