అర్ధరాత్రి అల్లుడికి మర్యాద.. ఒకరు మృతి
posted on Jun 17, 2021 @ 3:13PM
అల్లుడికి కూతురుకు మధ్య తిరుపతిలో వెంకన్న గుడిలో పూజలు జరిగినట్లు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య సఖ్యత లేక సంసారంలో కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో అల్లుడిని, కూతురుని ఇంటికి పిలిచిన అత్తామామలు అల్లుడికి అతిగా మర్యాదలు చేశారు. అదే వారు చేసిన పొరపాటు అయింది. మందు వేస్తే ఒక్కచోట ఉండదుగా మానవ జన్మ.. క్షణికావేశంలో దాడి చేసుకోవడంతో ఒకరు మృతిచెందాడు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో జరిగిందీ ఘటన.
తాడేపల్లి మండలం నులకపేటకు చెందిన దుర్గారావు కొన్నాళ్ల క్రితం తన కూతురు లావణ్యను విజయవాడకు చెందిన నరేష్ ఇచ్చి వివాహం చేశారు. కొత్త పెళ్లి కొత్త కాపురం కొన్ని రోజులు సవ్యంగానే సాగిన వీరి సంసారంలో ఇటీవల గొడవలు రేగాయి. భార్య భర్తల గొడవలపై ఇరు కుటుంబ సభ్యులు ఇద్దరితో మాట్లాడారు. చిన్న గోవాదాలు జరిగితే సర్దుకుపోవాలి నచ్చజెప్పారు. తరుచు ఆ భార్య భర్తల మధ్య గొడవలు జరగడం కుటుంబ సభ్యులు వాళ్ళకి నచ్చచెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కారణం ఏంటో తెలియదుగాని నరేష్ పై కేసు నమోదు అవ్వడం ఆ తర్వాత జైలుకు కూడా వెళ్లొచ్చాడు.
కాగా, బుధవారం అత్తగారింటికి నరేష్ తన భార్యతో కలిసి వచ్చాడు. బాధలో ఉన్న అల్లుడికి మర్యాదల్లో లోటు రాకూడదని ఏర్పాట్లు మందు తీసుకు వచ్చి మత్తు ఎక్కేలా పార్టీ ఘనంగా చేశారు. అయితే సాయంత్రం నుంచి మందు తాగుతున్న నరేష్.. అత్తామామలతో జరిగిన డిస్కర్షన్ లో మాటామాటా పెరిగి తన భార్య లావణ్యపై దాడి దిగాడు. ఇక అల్లుడిని ఆపేందుకు అత్తామామలు రంగంలోకి దిగారు యెంత వద్దని చెప్పిన, పద్ధతి కాదని ప్రయత్నించినా మద్యం మత్తులో ఉన్న అతడు ఆగలేదు. ఈ పెనుగులాటలో మామ దుర్గారావు ఇనుప రాడ్ తో అల్లుడిపై దాడి చేశారు. దీంతో నరేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. భార్య లావణ్య, అత్తామామలను అదుపులోకి తీసుకున్నారు.