ఐస్ క్రైమ్ పేరు బ్లాక్ డైమండ్ .. ధర 60 వేలు..
posted on Jul 21, 2021 @ 2:41PM
ఐస్ క్రైమ్ ఆ పేరు వింటే చిన్న పెద్ద, చివరికి వయసుతో తేడాలేకుండా అందరి నోళ్లు ఉరిల్లు ఊరుతాయి. మన దేశంలో సాధారణంగా ఐస్ క్రీమ్ ల ధరలు చూసుకుంటే 10 రూపాయల నుంచి మొదలై వేయి రూపాయల వరకు ఉంటాయి. అది ఎవరి తహతనిబట్టి వాళ్ళు తింటుంటారు. కానీ మనం మాట్లడుకోబోయే ఐస్ క్రైమ్ ధర అక్షరాల 60 వేల రూపాయలు. అంటే ఒక సామాన్యుడి ఆరునెలల జీతం అన్నమాట. చాలా ప్రదేశాల్లో ఐస్ క్రీమ్ ల ధరలు షాక్ కలిగేలా ఉంటాయి. ఇంత ధర చెల్లించి అసలు వీటిని ఎవరు కొంటారు? అనే ఆశ్చర్యం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. కానీ ఐస్ క్రీమ్ లంటే చాలా మందికి ఫేవరెట్. ఆ కారణం చేతే కొంత మంది ఎంత రేటైనా చెల్లించి ఐస్ క్రీమ్ ను తినాలని చూస్తుంటారు. అటువంటి వారి కోసం నిర్వహకులు కూడా వివిధ వెరైటీలతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తుంటారు.
ఒక మన దేశంలోనే అని కాదు ప్రపంచవ్యాప్తంగా ఐస్ క్రైమ్ అంటే ఎక్కడైనా ఫేమస్.. ప్రాంతంతో సంబంధం లేకుండా.. వానాకాలం ఎండాకాలం, చలికాలాలతో సంబంధం లేకుండా పిల్లలు ఈ ఐస్ క్రీమ్ లను తినేందుకు చాలా మక్కువ చూపుతారు. వాళ్ల పేరెంట్స్ వద్దని చెప్పినా నాకు ఐస్ క్రైమ్ కావాలి.. నాకు ఐస్ క్రైమ్ కావాలి అని గొడవ చేసి మరి ఎలాగైనా ఐస్ క్రీమ్ లు తింటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఐస్ క్రీమ్ లతో పాటు చివాట్లు కూడా తింటుంటారు. అప్పుడప్పుడు దెబ్బలు కూడా పడుతుంటాయి. ఇలా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ ల గురించి ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన ట్రావెలర్ షెనాజ్ ట్రెజరీ కి దేశ విదేశాల్లో ఉన్న ఐస్ క్రీమ్ ల రుచులు చూడాలని కోరిక పుట్టింది. అందుకోసమే ఆమె ఈ మధ్యే దుబాయ్ కి వెళ్లి అక్కడ ఉన్న ఐస్ క్రీమ్ రుచి చూసింది. కేవలం ఆమె రుచి చూడడమే కాకుండా అక్కడి ఐస్ క్రీమ్ రకాలను అందరికీ పరిచయం చేస్తూ... యూ ట్యూబ్ లో ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఆమె చెప్పిన ప్రకారం దుబాయ్ లోని జుమేరా రోడ్డులో ఐస్ క్రీమ్ ధర వింటే మన కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏకంగా అక్కడ ఐస్ క్రీమ్ కు 840 డాలర్ల ధర ఉందని ఆమె తెలిపింది. మన దేశ కరెన్సీలో 840 డాలర్లంటే దాదాపు 60వేల రూపాయల పైమాటే.
ఇక అరవై వేల రూపాయల ధర ఉండేందుకు ఆ ఐస్ క్రీమ్ ను దేనితో తయారు చేసి ఉంటారని ప్రతి ఒక్కరిలోనూ సందేహం కలుగుతోంది. ఆ ఐస్ క్రైమ్ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలనుకుంటాడు. అయితే ఈ ఐస్ క్రీమ్ తయారీలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెనీలా బీన్స్ బంగారు రేకులు ఉపయోగిస్తారట. అందుకే ఆ ఐస్ క్రీమ్ కు అంతలా రేటు హైదరాబాద్ లో సైట్ లా ఈ ఐస్ క్రైమ్ కి ఆ ధర నిర్ణయించారు. అంతే కాకుండా 60 వేల రూపాయలున్న ఐస్ క్రీమ్ కు బ్లాక్ డైమండ్ అనే పేరును కూడా పెట్టారు. షెనాజ్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఒక్క ఐస్ క్రీమ్ రేటుతో ఇండియాలో ఒక చిన్న కుటుంబం ఏడాది పాటు బతికేయ వచ్చు కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంత రేటు ఉన్నా కూడా అక్కడ ఆ ఐస్ క్రీమ్ ను చాలా మందే తింటున్నారని షెనాజ్ తెలిపారు.