థాంక్స్ మమ్మీ!
posted on Oct 22, 2022 @ 10:30AM
పిల్లలతో కలిసి జీవించడం సరదాగా ఉంటుందని మీలో ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. అవి చాలా అంద మైనవి , చాలా ముఖ్యమైనవి చాలా వినోదాత్మకంగానూ ఉంటాయి. పిల్లలు కొన్నిసార్లు ఊహించని పను లు చేసినప్పటికీ, అది చాలా విలువైనవిగానూ అనిపిస్తాయి. టెన్త్ చదివే పిల్లాడు తల్లి లేదా తండ్రి ఆఫీస్ నుంచి రాగానే కాఫీ చేసివ్వడమో, వంటింట్లో గరిటెతిప్పి నూడుల్స్ చేసివ్వడమో గొప్ప ఆనం దాన్నిస్తుంది. పెద్దవారికి అంతకంటే ఏం కావాలి!
ఒక పిల్లాడు తనకు చిరుతిండి తినాలనిపించి ఇల్లంతా వెతికేడు. ఏమీ దొరకలేదు. స్టూల్ తెచ్చి ఎక్కి వం టింట్లో అరలూ వెతికాడు ఎక్కడా ఏమీ ఉన్న రహస్యాలు బయటపడలేదు. వెంటనే ఫోన్ పట్టుకుని తల్లికి ఫోన్ చేశాడు. తల్లి ఆఫీస్‌లో ఫుల్ బిజీ. అయినా రెండు కాల్స్ వచ్చేసరికి ఏమయిందా అని తీసింది. ఏరా నాన్నా.. ఏమయింది? అన్న ఏమన్నా అన్నాడా, మామ్మ ఏమన్నా అన్నదా అని వెయ్యి ప్రశ్నలు వేసింది. వాడేమీ పట్టించుకోలేదు. ఆకలేస్తోంది. వచ్చేప్పుడు ఏదన్నా తీసుకురా టమ్మీ ఆకలేస్తోంది మమ్మీ! అన్నా డు ముద్దుగా.. అంతే అవతల తల్లి ఏడవలేదుగాని గట్టిగా నవ్వుకుంది ఆ అభ్యర్ధనకి. అంతేకాదు ఆ పిల్లా డు ఏకంగా మేసేజ్‌లూ పెట్టాడు. ఆమె మెసేజ్‌లతోనూ పలకరించింది. ఆమె ఆఫీస్ పని వత్తిడి నుంచి రవ్వంత విశ్రాంతి పొందింది. ఇంతకీ పిల్లాడి మెసేజ్‌లో ఏమన్నాడో తెలుసా..
అమ్మ, పిజ్జా ఆర్డర్ చేయగలవా?
ఆ వచ్చురా!
ఇప్పటికిప్పుడే పంపడం వచ్చునా?
నా మీటింగ్ కాగానే వచ్చేట్టుచేస్తా సరేనా!
ఓకే. థాంక్యూ మమ్మీ!
ఆమె ఆర్డర్ చేసి పంపించింది. వాడు అంతా తినలేదుట. ఓ పెద్ద ముక్క తల్లికోసమూ ఉంచాడు!