జనసేన కార్యాలయంపై వైసీపీ దాడి
posted on Oct 22, 2022 @ 11:01AM
రాజకీయాలు రోజురోజుకీ విమర్శల నుంచి దాడులకి దిగజారుతోంది. ప్రత్యర్ధులు చేసిన కామెంట్లను చాలా సీరియస్‌గా తీసుకుని ఏకంగా వారి నాయకులు లేదా పార్టీ కార్యాలయాల మీదా దాడులకు వెను కాడటం లేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జనసేన కార్యాలయం మీద కొందరు వ్యక్తులు దాడి చేసి ఫర్నీచర్‌ని ధ్వంసం చేసి భయభ్రాంతులు కల్పించారు. కాగా వారు తప్పకుండా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచరులే అని స్థానిక జనసేన పార్టీ నాయకులు అంటున్నారు.
మూడురోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్య లు చేశారు. ఇందుకు టెక్కలి ప్రాంత జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహించారు. శుక్రవారం జరి గిన దాడి తప్పకుండా వారే చేయించారని ఆముదాలవలస నియోజకవర్గ జనసేన ఇన్‌చార్ఝ రామ్మెహన్ శ్రీకా కుళంలో ఏ ఎస్‌పీ శ్రీనివాస్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీకి చెందిన వారు తమ పార్టీ కార్యాల యంపై దాడి చేసారని….వారిని అరెస్ట్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరో వైపు జనసేన పార్టీ కార్యాలయంపై దాడికి స౦బ౦ధించి టెక్కలి నియోజకవర్గ బీజేపీ నాయకులు స్ప౦ది చారు. జనసేన పార్టీ కార్యాలయంకి వెళ్లి జనసైనికులకు స౦ఘీభావ౦ తెలిపారు.
తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీకి చెందిన కీలక నేతలు వరుసగా పవన్ పై విమర్శలతో దాడికి దిగుతున్నారు. తాజాగా జనసేన కార్యాల యం పై వైసీపీ శ్రేణులు దాడికి దిగాయి. అయితే ఇటీవలి కాలంలో విపక్షాలపై బూతు పురాణంతో విరుచుకు పడుతూ, ఏమాత్రం సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నది వైసీపీ నాయకులేనని విపక్షాల ఆరోపణ. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పట్టు కోల్పోవడం, వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం సన్నగిల్లడంతోనే ఈ తరహా దాడులకు దిగుతున్నా రన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.