తెలుగుకు పట్టంకడుతున్న తెలుగు వన్ డాట్ కామ్!
posted on Aug 29, 2012 @ 9:50AM
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లందర్నీ ఒక్కటిగా నిలబెట్టాలన్న సదాశయంలో మొదలైన ఏకైక సంస్థ తెలుగువన్ డాట్ కామ్. తెలుగు భాషని, తెలుగు సంప్రదాయాన్ని, సంస్కారాన్నీ, విలువల్నీ ప్రపంచవ్యాప్తం చేయాలన్నదే మా ప్రయత్నం. తెలుగు భాషకు పట్టంకట్టేందుకు, ప్రపంచదేశాల్లో తెలుగువాళ్లని ప్రథమస్థానంలో నిలబెట్టేందుకు కంకణంకట్టుకున్న ఏకైక వెబ్ సైట్ తెలుగు వన్ డాట్ కామ్.
తెలుగువాళ్లందర్నీ ఒక్కటిగా నిలబెట్టేందుకు మేం చేస్తున్న బలీయమైన ప్రయత్నానికి టోరీ ఓ బలమైన వేదికగా నిలుస్తోంది. ప్రపంచదేశాలన్నింటినుంచి తెలుగుభాషంటే విపరీతమైన అభిమానం ఉన్న వందమంది టోరీకి ఆర్జేలుగా పనిచేస్తూ తెలుగుభాషకి, తెలుగు సంప్రదాయాలకూ అతి విలువైన సేవలందిస్తున్నారు.
తెలుగు భాషకి పట్టంకడుతున్న తొలి తెలుగు వెబ్ సైట్ తెలుగు వన్ డాట్ కామ్. తెలుగు భాషను ప్రపంచవ్యాప్తం చేసేందుకు అంతర్జాలంలో వచ్చిన తొలి వెబ్ సైట్ తెలుగు వన్ డాట్ కామ్. ప్రపంచదేశాల్లోఉన్న తెలుగువాళ్లంతా అత్మీయానురాగాల్ని కురిపిస్తూ అక్కున చేర్చుకున్న తొట్టతొలి వెబ్ సైట్ తెలుగువన్ డాట్ కామ్..
ఇప్పటికీ, ఎప్పటికీ మా లక్ష్యం ఒక్కటే తెలుగువాళ్లంతా చల్లగా ఉండాలి. తెలుగు నేలపై పుట్టినవాళ్లంతా ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కటిగానే ఉండాలి. తెలుగుతల్లి ప్రాభవాన్ని దశదిశలా చాటాలి. తెలుగువాళ్ల సత్తాని ప్రపంచానికి రుచిచూపించాలి. తెలుగు పలుకులో ఉన్న తియ్యదనాన్ని తెలుగుబిడ్డలంతా ఆనందంగా అనుభవించాలి.