సినీ పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందాం : సీఎం రేవంత్
posted on Aug 24, 2025 @ 10:24PM
తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలుగు సినిమా పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో ఆయను తెలుగు సినిమా నిర్మాతలు, దర్శకులు కలిశారు. పరిశ్రమలోకి కొత్త గా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. టాలీవుడ్‌లో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని వారితో తెలిపారు.
తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని ముఖ్యమంత్రి తెలిపారు. పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాని. పరిశ్రమలో నిర్మాతలు,కార్మికుల అంశం లో సంస్కరణలు అవసరం ఉందని సీఎం తెలిపారు. సినీ కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని..నిర్మాతలు,కార్మికులు,ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందన్నారు. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరమని..పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందామని సీఎం రేవంత్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఉన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డీవీవీ దానయ్య, వంశీ, గోపీ, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల, తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.