లిక్కర్ స్కాంలో వైసీపీకి... నారాయణస్వామి టెన్షన్
posted on Aug 24, 2025 @ 5:20PM
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఒకప్పుడు మాట్లాడితే వైసీపీ నేతలు తెగ ఎంజాయ్ చేసారు. ఇప్పుడు అదే స్వామి మాట్లాడితే ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని భయపడే పరిస్థితి వచ్చింది. దాంతో అయన చుట్టు కోటరీగా లాగా చుట్టుకుని అయన నోరు తెరవడకుండా కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎక్కడ తమ పేర్లు బయటపెడతారో అని భయపడుతున్నారంట పార్టీ పెద్దలు. మొత్తం మీద ప్రస్తుతం వైసీపీ పెద్దలందరికీ నారాయణస్వామి ఫీవర్ పట్టుకుందంట.
వైసీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నారాయణస్వామి ఒక వెలుగు వెలిగారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం కల్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం హోదాతో పాటు, కీలక మైన ఎక్సెజ్ శాఖతో పాటు కమర్షియల్ ట్యాక్సెస్ మంత్రిగా అవకాశం కల్పించారు. దీంతో అయన తనకు తిరుగులేదన్నట్లు చెలరేగిపోయారు. కాని పదవీ కాలంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటనలో సైతం డిప్యూటీ సీఎంకు వేదికపై కుర్చీ ఇవ్వలేదు. క్యాబినేట్ మంత్రులు కుర్చీల్లో కూర్చోని పవర్ ఎంజాయ్ చేస్తుంటే అయన వెనుక నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది..
మాజీ డిప్యూటీ సియం నారాయణస్వామితో అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబును, జనసేనాని పవన్ కళ్యాణ్‌ను తెగ తిట్టిస్తూ వైసీపీ పెద్దలు ఆనందించారు. అంతేకాకుండా వారినే కాకుండా వారి కులాలను సైతం అయన చేత తిట్టించి తెగ అనందపడ్డారు. అసెంబ్లీలో సైతం ఆయన చెలరేగిపోతుంటే జగన్ హ్యాపీ అయిపోయారు. ఇక ఎన్నికల ముందు జిల్లాకు చెందిన ముఖ్యనేత అయినప్పటికీ నారాయణస్వామిని అష్ట కష్టాలు పెట్టారు. ఏకంగా అయన్ని జీడి నెల్లూరు అసెంబ్లీ బరి నుంచి తప్పించి చిత్తూరు ఎంపి అభ్యర్థిగా ప్రకటించారు.
చివరకు నారాయణస్వామి నానా తంటాలు పడి.. పార్టీలో అవమానాలు ఎదుర్కొంటూ కూతురికి జీడి నెల్లూరు టికెట్ ఇప్పించుకోగలిగారు. అయితే ఉహించని రీతిలో రాష్ట వ్యాప్తంగా కూటమి గాలిలో కూతురు ఓటమి పాలయ్యింది. ఓటమి తర్వాత అయన తన కూతురు రాజకీయ ఓటమికి కారణం పార్టీ లోని సీనియర్ నాయకులతో పాటు స్థానికంగా ఉన్న వారి అనుచరులే అని అగ్రహం వ్యక్తం చేసారు..కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కాంపై సిట్ విచారణ ముమ్మరమైంది.
చిత్తూరు జిల్లాకు చెందిన వారే అందులో కీలకం అయ్యారు.రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అయన కూమారుడు మోహిత్ రెడ్డి , భాస్కర్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీతో పాటు కిరణ్ కూమార్ రెడ్డి వంటి వారిపై కేసులు నమోదయ్యాయి. అయితే తన వరకు కేసు రాదనుకున్న నారాయణస్వామికి సైతం సిట్ ఉచ్చు బిగుసుకుంది. నెల క్రితం అయనకు సిట్ అధికారులు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడంతో అనారోగ్య కారణాల వల్ల వాట్సాప్ లో పంపిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాజాగా అయన ఇంటికి వచ్చింది సిట్ బృందం. సుమారు అరుగంటల పాటు విచారణ జరిపింది.
విచారణలో మద్యం పాలసీ మార్పులో ఎక్సైజ్ శాఖా మంత్రిగా నారాయణస్వామి పాత్ర, అన్ లైన్ ద్వారా మద్యం బుకింగ్ లు మార్చి మ్యాన్ వల్ చేయడం, ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు, డిజిటల్ చెల్లింపులకు ఎందుకు అనుమతించలేదు అన్న అంశాలపై వందకు పైగా ప్రశ్నలు అడగటమే కాకుండా టెక్నికల్ టీమ్స్ ద్వారా అయన గాడ్జెట్స్ ను పరిశోధించడం..రెవెన్యూ అధికారుల సమక్షంలో అయన వాంగ్మూలము రికార్డు చేయడం జరిగిందని తెలుస్తోంది. అయితే అయన చాలా ప్రశ్నలకు అంతా పైవారు చెప్పినట్లే చేశానని సమాధానం ఇచ్చారంట. ఏదేమైనా మొత్తం వ్యవహారం సీరియస్ అయ్యింది.. నారాయణస్వామి ఎవరి పేర్లు చెప్పారనే ఉత్కంఠ వైసీపీ నేతల్లో కనిపిస్తోంది
విచారణ తర్వాత నారాయణస్వామి ఇంటి బయటకు వచ్చినప్పుడు వైసిపి నేతలు హైడ్రామా క్రియెట్ చేసారు. ముఖ్యంగా నారాయణస్వామి ,అయన కూతురు మీడియాతో మాట్లాడటానికి ప్రయత్నిస్తుండగా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఉదయం సిట్ బృందం వచ్చిందని తెలిసినప్పటికి పెద్దగా ఎవ్వరూ అక్కడికి రాలేదు. అయితే విచారణ ముగిసే సమయానికి పుత్తూరు కు చెందిన వైసీపీ నేతలు వచ్చి మీడియాతో ఎక్కడ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడతారో అని మీడియాతో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు.
దాంతో ఒకానొక దశలో సీరియస్ అయిన నారాయణ స్వామి మీడియాతో మాట్లాడి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఈసందర్భంగా సిట్ అధికారులు తనకు సహాకరించారని ,వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని వివరణ ఇచ్చారు. సిట్‌కు వ్యతిరేకంగా ఒకమాట కూడా మాట్లాడలేదు..దాంతో పాటు భవిష్యత్ లో కూడా సిట్ కు సహాకరిస్తానని చెప్పడం వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదంట..
ఇప్పటికే చిత్తూరు జిల్లాలో మద్యం స్కామ్ లో కీలక నేతలు అరెస్ట్ కావడంతో పాటు మరికొన్ని కేసులు చుట్టుకుంటుడంతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆడుదాం ఆంద్రాతో రోజా, ఎపిక్ కార్డుల ఇష్యూ తో భూమన కరుణాకర్ రెడ్డి టీమ్‌లకు ఉచ్చు బిగుసుకుంటుంది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసుకు సంబంధించి ఎక్సెజ్ శాఖ మాత్యులుగా ఐదు సంవత్సరాలు ఉన్న నారాయణ స్వామి అన్ని విషయాలు బయటపడితే నెక్ట్ ఎవ్వరు అనే కొణంలో చర్చ నడుస్తుంది. మొదట్లో ఇదేమి పెద్ద వ్యవహారం కాదు అన్న రీతిలో పట్టించుకోని వైసీపీకి ఇప్పుడు లిక్కర్ స్కాం పెద్ద తలనొప్పిగా మారింది. మొత్తం మీద వైసీపీ నేతలకు నారాయణ స్వామి ఫీవర్ గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తోందిప్పుడు.