అధికారంలో ఉన్న జాగ్రత్తగా ఉండాలంటున్న కేటీఆర్...
posted on Dec 29, 2019 9:06AM
మున్సిపల్ ఎన్నికల షడ్యూల్ విడుదలైన సంగతి అందరికి తెలిసిందే. అప్పటి నుంచి తెలంగాణ నేతల్లో జోరు పెరిగింది. అధికారంలో ఉన్నాం కదా అని మున్సిపల్ ఎన్నికల్ని లైట్ తీసుకోవద్దని నేతలకు ఆదేశాలు ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మున్సిపోల్స్ లో క్లీన్ స్వీప్ చేసేందుకు ఇన్ చార్జిలను కూడా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా మునిసిపాలిటీల్లో వారు పర్యటించి అక్కడ తాజా పరిస్థితి పై ఈ నెలాఖరు లోపు నివేదిక రూపంలో ఇవ్వా లని టీఆర్ ఎస్ కార్యవర్గ సమావేశంలో ఆదేశించారు.
ప్రతివార్డుకి ముగ్గురు ఆశావహుల పేర్లు ఇవ్వా లని కెటిఆర్ సూచించారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు ఉంటే ఆయన చేర్చుకోవాలన్నారు. అనుకోకుండా నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ తమకేదో బలం ఉందని ఊహించుకుంటోందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో మత రాజకీయాలు నడవబోతున్నారు. మతాల్ని రెచ్చగొట్టా లని అనుకుంటున్న బీజేపీని ప్రజలు సహించబోరని కేటీఆర్ తెలియజేశారు. ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని కొత్తగా పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు.
తెలంగాణ భవన్ లో ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది మంత్రులు పార్టీ ప్రధాన కార్య దర్శులు అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టిఆర్ ఎస్ కు పట్టం కట్టారని కెటిఆర్ గుర్తు చేశారు. విపక్షాల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు గా ఉందన్నారు. ప్రజల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు.తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ దూసుకుపోతోందని చెప్పారు. తాము నేల విడిచి సాము చేయడం లేదన్నారు. సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఎజెండాగా ముందుకు పోతున్నట్లు తెలిపారు. ఆరు లక్షల మందికి కేసీఆర్ కిట్ అందించామని, 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నట్టు చెప్పారు.
ప్రజలు మళ్లీ టీఆర్ఎస్ ని ఆశీర్వదిస్తారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.అంతే కాక కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. ముస్లిం లను మినహాయిస్తే తాము బిల్లుకు వ్యతిరేకం కాదని చెప్పారు టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.తమ పార్టీ రాజకీయ పార్టీ కాదని ప్రజలకు మేలు చేసే పార్టీ అని తెలియజేశారు. పార్లమెంట్లో పౌరసత్వ బిల్లును తాము వ్యతిరేకించడం పై స్పష్టతనిస్తూ తాము అన్నొ బిల్లులను సమర్ధించామని తాజగా పెట్టిన ఆర్టికల్ 370 బిల్లును కూడా సమ్ర్ధించినట్లు తెలియజేశారు.తాజా బిల్లులో ముస్లింలను మినహాయించి అని రూపొందించిన బిల్లును తాము సమ్మతించమని ఆ మాటలను తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు.ముస్లింలను కూడా ఈ బిల్లులోచేరిస్తే తాము కూడా ఈ బిల్లుకు అనుకూలంగా సభలో అనుకూలంగా ఓట్లు వేస్తామని కేటీఆర్ వెల్లడించారు.