మాటలు కాదు చేతలు కూడా అవసరం

 

తెలంగాణా ఉద్యమానికి, ఎన్నికలలో గెలవడానికి అద్భుతంగా పనిచేసిన తెలంగాణా సెంటిమెంటు, పరిపాలన సాగించడానికి మాత్రం అంతగా వర్కవుట్ అవడం లేదనిపిస్తోంది. ఇదివరకు కేసీఆర్ మాటల గారడీకి మెచ్చుకొని జనాలు చప్పట్లు కొట్టినా, ఇప్పుడు ఆయన కరెంటు ఈయలేక చేతులు పిసుకొంటూ కూర్చోవడంతో జనాలు కూడా ఇప్పుడు చప్పట్లు కొట్టడం మరిచిపోతున్నారు. కరెంటు కోసం మరో రెండు మూడేళ్ళు ఆగమని ఆయన చెపుతున్నా వినకుండా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అయితే ఆ పాపం గత ప్రభుత్వాలదేనని ఆయన చేతులు కడిగేసుకొన్నారు.

 

ఇప్పుడు ఆయన ఏమి చెప్పినా జనాలు కూడా వినిపించుకొనే పరిస్థితి కనబడటం లేదు. అందుకే హైదరాబాద్ రోడ్లని సినీ హీరోయిన్ బుగ్గలా నున్నగా మెరిపిస్తామని, వైఫీ సౌకర్యం కల్పిస్తామని, గొలుసుకట్టు చెరువులు బాగు చేయించి నీళ్ళు ఇస్తామని ఏవేవో కొత్త కొత్త హామీలు గుప్పిస్తున్నారు. కానీ ‘సమస్యల గొంగళీ’ మాత్రం వేసిన చోటనే ఉంది.

 

ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణా ప్రభుత్వ ఆదాయం బాగానే ఉందనే టాక్ ఒకటుంది. ఆంధ్రా దగ్గర కరెంటు ఉంది. కానీ డబ్బు లేదు. కనుక తనదగ్గర ఉన్న డబ్బు పెట్టి ఆంధ్రా దగ్గర కరెంటు కొనుకొనే ఆలోచన చేస్తే ఇరువురి కష్టాలు తీరవచ్చును. కానీ అందుకు అహం అడ్డువస్తోంది. పోనీ కేంద్రాన్ని కరెంటు ఇమ్మని అడగవచ్చును కానీ కేంద్రంతో కూడా పడదాయే.

 

ఇప్పుడు కేసీఆర్ కొత్తగా మరో గొప్ప సత్యం కనుకొన్నారు. అదేమంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కంటే రాష్ట్ర విభజన తరువాతే తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎక్కువయిపోయిందని! అయితే ఈ ఐదు నెలలలో తెలంగాణాకి కొత్తగా భారీ పరిశ్రమలేవీ రాలేదు. కొత్తగా లక్షల ఎకరాలలో ఎవరూ పంటలు వేయలేదు. మరి అటువంటప్పుడు అకస్మాత్తుగా విద్యుత్ వినియోగం ఎలా పెరిగిపోయిందో ఆయనే వివరించితే బాగుండేది. అయినా విద్యుత్ సరఫరాయే లేకపోతే ఇక వినియోగం ఎలా పెరుగుతుంది? అని ఆలోచిస్తే తగినంత విద్యుత్ సరఫరా లేకపోవడం వలననే కొరత ఏర్పడింది తప్ప వినియోగం పెరగడం వలన కాదని అర్ధమవుతోంది.

 

అటువంటప్పుడు బేషజానికి పోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తానంటున్న 300మెగావాట్స్ విద్యుత్ తీసుకొని వీలయితే అదనపు విద్యుత్ కూడా అడగవచ్చును. అదేవిధంగా విద్యుత్ సమస్యపై తనను నిలదీస్తున్న ప్రతిపక్షాలను, ముఖ్యంగా బీజేపీ నేతలను కూడా వెంటేసుకొని కేసీఆర్ డిల్లీ వెళ్లి మోడీపై ఒత్తిడి తెస్తే ఏమయినా ప్రయోజనం ఉండవచ్చును. కానీ మాటలతోనే ప్రజలను మురిపిద్దామని ప్రయత్నిస్తే కధ అడ్డం తిరిగే ప్రమాదం ఉంది.

తమిళనాట కొత్త పొత్తు పొడుపు?

జననాయకన్ సినిమా విడుదల, కరూర్ తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. ఇలా తమిళనటుడు, టీవీకే అధినేత విజయ్ ను కష్టాలు ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా వెంటాడుతున్నాయి. సొంత పార్టీ ఏర్పాటు చేసి, ఈ ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమౌతున్న వేళ విజయ్ ను నాన్ స్టాప్ గా కష్టాలు వెంటాడుతున్నాయి. విజయ్ తన చివరి చిత్రంగా ప్రకటించిన జననాయకన్ సినిమా ఈ పండుగ సందర్భంగా విడుదల అయ్యే అవకాశం లేకుండా పోయింది. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో విషయం కోర్టు మెట్లెక్కింది. దానికి తోడు  క‌రూర్  తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఇప్పటికే గంటల తరబడి విజయ్ ను విచారించిన సీబీఐ మరో మారు ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు పంపింది.   అయితే ఈ వేధింపుల వెనుక ఉన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయేనని పరిశీలకులు అంటున్నారు. తమిళనాట ఇసుమంతైనా స్టేక్ లేని బీజేపీ విజయ్ తో పొత్తు ద్వారా రాష్ట్రంలో పాగా వేయాలనే ఉద్దేశంతోనే వ్యూహాత్మకంగా విజయ్ ను చక్రvgధంలో ఇరికిస్తోందన్న వ్యాఖ్యలూ వినవస్తున్నాయి. ఇక విజయ్ కు కమలంలో దోస్తీకి సై అనక తప్పదన్న విశ్లేషణలూ వెలువెడ్డాయి. అయితే అనూహ్యంగా విజయ్ కు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ మద్ద తుగా నిలిచారు.   విజ‌య్ పై  వేధింపుల‌కు పాల్ప‌డ్డం అది త‌మిళ సంప్ర‌దాయాల‌ను భంగ‌ప‌ ర‌చ‌డ‌మే  అవుతుంద‌ని రాహుల్ విమర్శించారు.  దీంతో విజయ్ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తుపొడుపునకు అవకాశాలున్నాయా అన్న చర్చకు తెరలేచింది.  ఇప్పటికే విజ‌య్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తమ పార్టీ  ఎవరితోనూ పొత్తు లేకుండా స్వతంత్రంగానే రంగంలోకి దిగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. త‌మ‌కు డీఎంకేతో స్థానిక రాజ‌కీయ విబేధాలుంటే, కేంద్ర‌ంలోని  బీజేపీతో సైద్ధాంతిక విబేధాలున్నాయ‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కూ డీఎంకేతో కలిసి ఉన్న కాంగ్రెస్ స‌డెన్ గా విజ‌య్ కి మద్దతుగా గళం విప్పడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాట కొత్త పొత్తు పొడుపునకు ఇది సంకేతమా అన్న చర్చా జోరుగా సాగుతోంది.  తొలి నాళ్ల‌లో త‌మిళ‌నాట‌ కాంగ్రెస్ పార్టీ బ‌లంగానే ఉన్నా.. ఆ త‌ర్వాత డీఎంకే, ఏఐడీఎంకే రూపంలో ఈ రెండు పార్టీలే ఇక్క‌డ అధికారం పాల్పంచుకుంటూ వ‌స్తున్నాయి.  కేసీఆర్ లాంటి వారికి ఈ డీఎంకే అన్నాడీఎంకే పాలసీ  ఎంతో ఇష్టం. త‌న కొడుకు కేటీఆర్, అల్లుడు హ‌రీష్ కూడా ఇలాగే రెండుగా  చీలి.. ఇక్క‌డ అధికారం ఎవ‌రో ఒక‌రు పాల్పంచుకోవాల‌ని ఆశిస్తారాయ‌న‌.  అంత‌గా తమిళనాట స్థానిక రాజ‌కీయాలు గ‌త కొన్నేళ్లుగా పాతుకుపోయాయి. ఇప్పుడు డీఎంకే త‌ర్వాతి త‌రానికి కూడా బ‌లంగా  క‌నిపిస్తున్నా అన్నాడీఏంకేకి జ‌య‌ల‌లిత త‌ర్వాత ఒక దిక్కంటూ లేక పోయింది. శ‌శిక‌ళ రూపంలో బలమైన నాయకురాలు ఉన్నా.. మోడీ  కార‌ణంగా ఆమె అన్నాడీఎంకేకీ ఏమీ కాకుండా పోయారు. ఈ  స్థానంలో ఇక్క‌డ బీజేపీ  పాతుకుపోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తుంటే మ‌ధ్య‌లో తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న హీరో విజయ్.   టీవీకే పార్టీ ఏర్పాటు చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన విజయ్ అంటే బీజేపీకి ఆగ్రహం.  దానికి తోడు విజ‌య్ కూడా మెర్స‌ల్ వంటి సినిమాల ద్వారా బీజేపీ వ్య‌తిరేక వాణి వినిపించిన ప‌రిస్థితి గ‌తంలో ఉంది.  వ‌చ్చే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ పార్టీ టీవీకే పోటీ  చేయ‌నుండ‌టం.. బీజేపీతో ఎలాంటి  పొత్తు ఉండ‌ద‌ని విజ‌య్ ప్ర‌క‌టించ‌డంతో.. ఆయ‌న‌ను వీలైనంతగా త‌మ దారిలోకి తెచ్చుకోడానికి  బీజేపీ అగ్రనాయకత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. దీనిని విజయ్ ఎలా ప్రతిఘటిస్తారు? రాహుల్ విజయ్ కు మద్దతుగా గళం విప్పడం వెనుక కారణమేంటి? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండనుంది?  తేలాల్సి ఉంది.

జేపీ, లక్ష్మీనారాయణ బాటలో ఏబీవీ!

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటించారు. అందుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలిపారు.గతంలో అంటే 2014-2019 మధ్య కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. ఆ కాలంలో  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2019 ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ విజయం సాధించి జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన క్షణం నుంచీ ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) వేధింపులను ఎదుర్కొన్నారు. అవినీతి ఆరోపణలతో సస్పెండయ్యారు. 2020 ఫిబ్రవరిలో ఆయనను జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది.   అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన అలుపెరుగని న్యాయపోరాటం చేశారు. క్యాట్, హైకోర్టు,  సుప్రీంకోర్టులో సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, ఆయన తిరిగి సర్వీసులో చేరారు. అదీ సరిగ్గా పదవీ విరమణ రోజు.   ఆ తరువాత ఆయన  జగన్ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తూ ఆయన అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు.  ప్రెస్ మీట్లు నిర్వహించారు.  డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ లలో కూడా చురుగ్గా ఉంటూ.. జగన్ హయాంలో జరిగిన అన్యాయాలూ, అక్రమాలు, ఆర్థిక అవకతవకలను ఎండగట్టారు.   అది పక్కన పెడితే 2024 ఎన్నికలలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత..  ప్రభుత్వం ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని విధుల్లో ఉన్నట్లుగానే పరిగణించింది. ఆయనపై జగన్ సర్కార్ తీసుకున్న క్రమశిక్షణ చర్యలను రద్దు చేసింది. అలాగే..  ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించింది. అయితే తన కృషికి తగిన గుర్తింపు రాలేదన్న కినుకతో ఏబీవీ ఉన్నట్లు కనిపిస్తున్నారు.ఏపీ పోలీసు హౌసింగ్ బోర్డు చైర్మన్ పదవిని చేపట్టలేదు. జగన్ హయాంలో జరిగిన అవకతవకలపై విమర్శలతో పాటుగా, ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలనూ ప్రశ్నించడం ఆరంభించారు. ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు. లైక్ మైండెడ్ పీపుల్ తో కలిసి  ముందుకు సాగుతాననీ,  పార్టీకి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నాననీ కూడా ఏబీవీ చెప్పారు.  అయితే ఇక్కడే ఆయన రాజకీయ అడుగులు ఏ మేరకు సక్సోస్ అవుతాయన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. నిస్సందేహంగా ఏబీవీ నిజాయితీగల అధికారిగా విధినిర్వహణలో గుర్తింపు పొందారు. ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అయితే ఆ గుర్తింపు, ఆ అభిమానం ఒక రాజకీయ పార్టీని విజయవంతంగా లక్ష్యం దిశగా నడిపించేందుకు సరిపోతాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏబీవీలాగే  మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ కు కూడా నిజాయతీ పరుడైన అధికారిగా పేరు ఉంది. ఆయన సర్వీసులో ఉండగానే ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో సొంతంగా పార్టీ పెట్టారు. ఎన్నికల రణరంగంలోకి కూడా దిగారు. కానీ ఒకే ఒక ఎన్నికలో 2014లో ఆయన లోక్ సత్తా పార్టీ తరఫున పోటీ చేసిన అందరూ డిపాజిట్ కోల్పోయారు. ఆయన ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. అది పక్కన పెడితే.. ఆ తరువాత ఆయనా, ఆయన పార్టీ కూడా క్రియాశీల రాజకీయాలలో పూర్తిగా కనుమరుగయ్యారు. ఇక ఆయన తరువాత  సీబీఐ మాజీ జేడీ  కూడా నిజాయతీగల అధికారిగా ప్రజలలో మంచి గుర్తింపు పొందారు. ప్రజాభిమానాన్ని కూడా చూరగొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే జయప్రకాశ్ నారాయణ, లక్ష్మీనారాయణలకు ఏబీవీ కంటే ఎక్కువ గుర్తింపే ప్రజలలో ఉంది. అయితే క్రీయాశీల రాజకీయాలలో వారు తేలిపోయారు. ఉనికి మాత్రంగా మిగిలిపోయారు.  ఈ నేపథ్యంలోనే ఏబీవీ రాజకీయపార్టీ అనగానే పరిశీలకులు ఆయన ఏ మేరకు రాణిస్తారు అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  

తెలంగాణ మునిసిపోల్స్.. జనసేన, బీజేపీ ఎవరిదారి వారిదే!

తెలంగాణ  మునిసిపల్ ఎన్నికలకు ముందు కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఫిబ్రవరిలో తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలలో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఎన్డీయే కూటమిలో భాగస్వామి అయిన ఎన్డీయేతో తెలంగాణ ఎన్నికలలో పొత్త ప్రశక్తే లేదని తెలంగాణ బీజేపీ ప్రకటించడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.    సహజంగానే జనసేన తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో పోటీ అనగానే బీజేపీతో పొత్తు ఉంటుందని అంతా భావించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన బిజెపి, టిడిపిలతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సహజంగానే తెలంగాణలో కూడా అదే కూటమి కొనసాగుతుందని అంతా భావించారు. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రానున్న మునిసిపోల్స్ లో జనసేనతో తమ పార్టీకి ఎటువంటి పొత్తూ లేదంటూ ప్రకటించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. బీజేపీ తెలంగాణ మునిసిపోల్స్ లో స్వతంత్రంగా  పోటీ చేస్తుందని, జనసేన సహా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవనీ కుండబద్దలు కొట్టేశారు. రామచంద్రరావు ప్రకటనకు కొద్ది సేపు ముందే జనసేన తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాజకీయవర్గాలలో  పొత్తులపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. అయితే ఎన్డీఏ తరహా కూటమి కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితమనీ, ఇది తెలంగాణలో కొనసాగే అవకాశం లేదనీ రామచంద్రరావు ప్రకటనతో తేటతెల్లమైంది.  ఇందుకు ప్రధాన కారణం.. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్యా రాజకీయ వేడి రగులుస్తున్న జలవివాదాలేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ జలవివాదాల కారణంగానే.. ఆంధ్రప్రదేశ్‌లో   సన్నిహిత సమన్వయం ఉన్నప్పటికీ,  తెలంగాణలో పార్టీల మధ్య పొత్తుకు అవకాశం లేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.  ఆ కారణంగానే తెలంగాణలో  బీజేపీ, జనసేన పార్టీలు మునిసిపల్ ఎన్నికలలో ప్రత్యర్థులుగా రంగంలోకి దిగాల్సిన అనివార్యత ఏర్పడిందని అంటున్నారు.  

అమ‌రావ‌తి విష‌యంలో...జ‌గ‌నాసురుడి అస‌లు స్కెచ్ అదేనా?

  అమ‌రావ‌తి అంటే అర్ధ‌మేంటి? అని చూస్తే అమ‌రులుండే  ప్ర‌దేశం. దీనికి  మ‌ర‌ణం లేదు అని అర్ధం. ఇంకా చెబితే ఇంద్రుడి రాజ్యాన్ని కూడా  అమ‌రావ‌తీ అనే  అంటారు. ఇక బుద్ధుడు కాల‌చ‌క్ర బోధ‌న‌లు చేసిన ప్రాంతం కూడా ఇదే. ఇంత‌టి ఆధ్యాత్మిక‌, చారిత్ర‌క ప్ర‌దేశం కాబ‌ట్టే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానికి ఈ  పేరు పెట్టారు. ఇంద్రుడి  రాజ‌ధాని అమ‌రావ‌తిపై కూడా ఎన్నోసార్లు రాక్ష‌సులు దాడులు చేశారు. అప్పుడా దేవ‌త‌లు శ్రీమ‌హావిష్ణువును వేడుకోగా ఆయ‌న ద‌శావ‌తారాల ద్వారా ఈ రాజ‌ధానిని కాపాడిన ఉదంతాలు ఆధ్యాత్మికంగా  కోకొల్ల‌లు.ఆనాడు రాక్ష‌సులు ఎలా అమ‌రావ‌తిని అంతం చేయాల‌ని భావించారో.. ఇప్పుడు కూడా జ‌గ‌నాసురుడి వంటి రాక్ష‌సుల‌ తాకిడి ఎదుర్కుంటూనే ఉందీ రాజ‌ధాని.  తాజాగా  కూడా  రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని  నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి. ఆయ‌న ఇంగ్లీష్ లో చెప్పినా  దాని అర్ధం అమ‌రావ‌తి  నిర్మాణం త‌న‌కు ఇక్క‌డ ఇష్టం లేద‌ని చెప్ప‌డ‌మే. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయ‌డానికి మాజీ స‌క‌ల శాఖ‌ల మంత్రి స‌జ్జ‌ల రంగ ప్ర‌వేశం చేసి.. అమ‌రావ‌తి అంటే త‌మ‌కెలాంటి బేధాభిప్రాయాలు లేవ‌ని అన్నారు.  అయితే జ‌గ‌న్ చెప్పిన దానికీ దీనికి  చాలానే తేడా  క‌నిపిస్తోంది. అంటే అధినేత  ఇక్క‌డ అమ‌రావ‌తి నిర్మించ‌డ‌మేంట‌ని అంటే ఇక వెంట‌నే  ఆ అధినేత బంటు వ‌చ్చి తూచ్ అలాంటిదేదీ లేద‌ని చెప్ప‌డంలో ఒక మ్యాజిక్ దాగి ఉంద‌నే చెప్పాల్సి ఉంటుంది. అదెలాంటిదో చూస్తే.. గ‌తంలో నాని, ఆపై జోగి, నేడు స‌జ్జ‌ల వీరంద‌రి చేత అమ‌రావ‌తి అంటే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పించ‌డం. దీంతో జ‌గ‌న్ పార్టీ అమరావ‌తిపై ఎలాంటి వ్య‌తిరేక‌ఖ‌త లేద‌ని జ‌నం గంపగుత్త‌గా  ఓట్లు వేస్తార‌న్న వ్యూహం ఇందులో దాగి ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఇదే అమ‌రావ‌తిపై జ‌గ‌న్ ఇంగ్లీష్ లో  వ‌ద్ద‌ని చెప్ప‌డంలో ఇంకో వ్యూహం దాగి ఉంది.గ‌తంలో అమ‌రావ‌తి అంటే త‌న‌కెలాంటి వ్య‌తిరేక‌త లేద‌ని ఆయ‌న స్ప‌ష్టంగా తెలుగులో అది  కూడా అసెంబ్లీ వేదిక‌గా చెప్ప‌డం వ‌ల్ల‌.. గ‌త ఐదేళ్ల వైసీపీ  జ‌మానాలో ఎలాంటి న‌ష్టం జ‌రిగిందో తెలిసిందే. అప్ప‌ట్లో జ‌గ‌న్ ఒప్పుకున్నాడు క‌దా? అనే మాట  ప‌దే ప‌దే వినిపించింది. అదే ఇప్పుడు త‌న వారంద‌రి చేత అవున‌నిపించి తాను మాత్రం కాద‌న‌డం వ‌ల్ల అది కూడా ఆంగ్లంలో.. ఇదొక స్కెచ్ గా  తెలుస్తోంది. ఈ  స్కెచ్ ద్వారా వ‌చ్చే రోజుల్లో ఆంధ్రుల క‌ర్మ‌గాలి పొర‌బాటున  ఫ్యాను గాలి వీస్తే.. ఆపై తాను ఆనాడే చెప్పాన‌ని త‌ప్పించుకునేలా ఒక వెస‌లుబాటు క‌ల్పించుకున్నారు జ‌గ‌న్. అంతే  కాకుండా ఆయ‌న ద‌గ్గ‌ర ఇంకో థియ‌రీ కూడా రెడీగా  ఉండ‌నే  ఉంది. తాను ఎక్క‌డుంటే అదే రాజ‌ధానిగా  ఆయ‌న ఇది వ‌ర‌కే స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో తాను రిషికొండ ప్యాలెస్ లో కూర్చుని... ముందే చెప్పానుగా ఇదే మ‌న రాజ‌ధాని అంటూ ఆయ‌న ప్లేటు ఫిరాయించ‌డానికే ఇదంతా అన్న సంకేతాలు స్ప‌ష్టంగా అందుతున్నాయ్. కాబ‌ట్టి... బీఅవేర్ ఆఫ్ జ‌గ‌నాసుర! అన్న హెచ్చ‌రిక‌లు సైతం అంతే  స్థాయిలో సైర‌న్ మోగుతోంది.

చమురు మంటలతో పచ్చదనం పలచబడిపోతున్న కోససీమ

భూమికి పచ్చని రంగేసినట్లు హరిత శోభతో కళకళలాడే కోనసీమ ఇప్పుడు చమురు మంటల వేడి సెగలకు మాడిపోతోంది. పచ్చదనం పలచబడిపోతోంది.  కోనసీమ తీర ప్రాంతంలో అపార చమురు, సహజవాయు నిక్షేపాలున్నయన్న సంగతి వెలుగు చూసినప్పటి నుంచీ ఇక్కడి పచ్చదనానికి శాపం తగిలిందోమో అనిపిస్తుంది. ఓఎన్జీసీ చమురు, సహజవాయు అన్వేషణ ప్రారంభించిందో  అప్పటి నుంచే కోనసీమ పచ్చదనం పలచబడిపోవడం మొదలైంది. ఢ్రిల్లింగ్ పేరుతో తీర ప్రాంతంలో ఇష్టారీతిగా రిగ్గులు వేసేసిన ఓఎన్జీసీ.. అప్పటి నుంచే కోనసీమ వాసుల ఆరోగ్యంపై ప్రభావం పడటం మొదలైంది. తీర ప్రాంత గ్రామాల వారు కాలేయ సంబంధిత వ్యాధులకు గురి కావడం మొదలైంది. ఇదంతా చమురు, సహజవాయువు అన్వేషణ పేరుతో ఎఎన్జీసీ చేస్తున్న ప్రకృతి విధ్వంసం ఫలితమే అంటున్నారు వైద్య నిపుణులు, పర్యావరణ ప్రేమికులు.   సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని  పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. పచ్చని కొబ్బరి చెట్లు మూడు నాలుగు నిలువుల బొగ్గు చెట్లుగా మారిపోయాయి. కోనసీమలో భోగి మంటను ఓఎన్జీసీ ముందే వేసేసిందనీ, సంక్రాంతి పండగకు ముందు జరుపుకునే భోగి భోగభాగ్యాలను తీసుకువస్తుందంటారు. కానీ.. ఓఎన్జీసీ వేసిన ఈ భోగి మంట భోగభాగ్యాలను తుడిచేస్తోందనీ ఈ ప్రాంత వాసులు అంటున్నారు. ఇక ఇప్పుడు ఓఎన్జీసీ ఈ బ్లోఔట్ ను ఆపడం సాధ్యం కాదని తేల్చేసింది. మంటలు ఎగసిపడుతున్న బావిని శాశ్వతంగా మూసేయడమే మర్గమని నిర్ణయించింది. మూడు దశాబ్దాల కిందట పాశర్లపూడి బ్లో ఔట్ సమయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు ఈ బ్లో ఔట్ సంభవించిన బావిని మూసేయాలంటే   భారీ మడ్ ఫిల్లింగ్ యంత్రాలను సంఘటనా స్థలానికి తరలించడానికి పచ్చటి పొలాలకు అడ్డంగా భారీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. ఓఎన్జీసీ ఇప్పటికే ఆ పని మొదలెట్టేసింది. మొత్తంగా కోనసీమ చమురు, సహజవాయువుల నిక్షేపాల గని అని సంబరపడటానికి లేకుండా, వాటి వెలికితీత, అన్వేషణ చర్యల కారణంగా నిత్య రావణకాష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కేటీఆర్ క్లూలెస్.. కవిత డామినేట్స్!

తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ను కవిత విమర్శలు ఫేడౌట్ చేస్తున్నాయా? ఆమె విమర్శలకు దీటుగా బదులివ్వడంలో బీఆర్ఎస్ తడబడుతోందా? సొంత అన్నపై కూడా కవిత నేరుగా విమర్శలు సంధిస్తున్నా.. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మౌనం ఆ పార్టీ రాజకీయ పునాదులను కదిపేస్తోందా? అంటే ఔననే అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మండలి వేదికగా కల్వకుంట్ల కవిత సోమవారం చేసిన ఉద్వేగభరిత ప్రసంగాన్ని సభలో బీఆర్ఎస్ సభ్యులు కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించకుండా మౌనంగా ఉండిపోవడం, మండలి చైర్మన్ సైతం సమయ నియమాన్ని పట్టించుకోకుండా ఆమె ప్రసంగాన్నికొనసాగించడానికి అనుమతి ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన వారైనప్పటికీ.. ఆ పార్టీని విమర్శలతో చెండాడేస్తున్న కవితను కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అదే సమయంలో కవిత తన భావోద్వేగ ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీలో తాను ఎలా అవమానాల పాలైనదీ, తనను ఎలా పక్కన పెట్టేశారు. ఎలా బయటకు పంపేశారు అన్న విషయాన్ని చాలా చాలా ఎమోషనల్ గా చెప్పారు. అదే సమయంలో తాను పార్టీకి చేసిన సేవలనూ ప్రస్తావించారు.  ఆమె ఎమోషనల్ గా చేస్తున్న ప్రసంగాన్ని అడ్డుకుంటే ఆమెకు సానుభూతి మరింత పెరుగుతుందన్న భయంతో బీఆర్ఎస్ సభ్యులు మౌనం వహించి ఉంటారని అంటున్నారు. అయితే సభలో తన చివరి ప్రసంగం చేసి ఇప్పుడు వ్యక్తిగా ఒంటరిగా వెడుతున్నా.. కానీ ఒక శక్తిగా మళ్లీ తిరిగొస్తానంటూ ఆమె సభను వీడారు. ఇక మండలిలో ఇదే ఆమె చివరి ప్రసంగం అనడంలో సందేహం లేదు. అయితే ఈ ప్రసంగం ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం తథ్యమన్న సంకేతాన్ని ఇచ్చింది. ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు.   అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా కవితపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అవినీతిని వేలెత్తి చూపుతుంటే.. దానిని ఖండించడం మాని.. కవిత కూడా అవినీతికి పాల్పడ్డారన్నకోణంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కవితపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంటే పరోక్షంగా బీఆర్ఎస్ హయాంలో కవిత చెప్పినట్లుగా అవినీతి జరిగిందని అంగీకరిస్తున్నటుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజకీయంగా కవితను ఎలా ఎదుర్కొనాలన్న విషయంలో పార్టీలో  గందరగోళం నెలకొందన్న విషయాన్ని ఈ పరిస్థితి తేటతెల్లం చేస్తోందని   విశ్లేషిస్తున్నారు. ఇక కేటీఆర్ పై నేరుగా కవిత విమర్శల వర్షం కురిపిస్తున్నా ఆయన నేరుగా స్పందించకపోవడం పొలిటికల్ గా కవితకు అడ్వాంటేజ్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. కవిత విషయంలో కేటీఆర్ క్లూ లెస్ గా ఉంటే.. కవిత మాత్రం బీఆర్ఎస్ ను డామినేట్ చేసి పోలిటికల్ మైలేజ్ సాధిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

భోగాపురం ఎయిర్ పోర్ట్.. క్రెడిట్ వార్.. వాస్తవమేంటంటే?

విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ట్రయల్ రన్‌లో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి తదితరులు ప్రయాణించారు.   భోగాపురం ఎయిర్‌పోర్ట్ అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంటోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  పాటు  భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయి. నిర్మాణ సంస్థ జీఎంఆర్ జూన్ నెలలో పూర్తి స్థాయిలో విమానాశ్రయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండిగ్ ఒక మైలు రాయిగా చెప్పొచ్చు. అయితే ఈ విమానాశ్రయం ఘనత తనదేనంటూ వైసీపీ క్రెడిట్ కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నం ఒక రాజకీయ చర్చకు దారి తీసింది.   మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ విమానాశ్రయానికి అవసరమైన కీలక అనుమతులన్నీ తన హయాంలోలో వచ్చాయని చెప్పుకుంటున్నారు. అలాగే  ఈ విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణ కోసం తన హయాంలోనే దాదాపు 960 కోట్ల రూపాయలు వ్యయం చేశామని అంటున్నారు.  అయితే వైసీపీ అధినేత జగన్ మాటలను టీడీపీ కొట్టి పారేస్తోంది. భోగాపురం విమానాశ్రయం 2015లోనే  అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడి హయాంలోనే ప్రణాళికలు రూపొందాయనీ, దీనికి కేంద్ర అనుమతులు, భూ సేకరణ, ప్రాథమిక నిర్మాణాలూ చంద్రబాబు హయాంలోనే పూర్తయ్యాయనీ చెబుతోంది.  అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పడకేసిందనీ, జగన్ ప్రభుత్వం ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ, మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణం వేగం పుంజుకుందనీ చెబుతోంది.   ఈ రాజకీయ చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలూ పక్కన పెడితే.. అసలు వాస్తవమేంటంటే.. రికార్డు సమయంలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి కావడం, ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని, వచ్చే జూన్ నాటికి  ఈ విమానాశ్రయం ప్రయాణీకులకు అందుబాటులో రావడానికి ప్రధాన కారణం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నది నిర్వివాదాంశం. శ్రీకాకుళం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యంవహిస్తున్న ఆయన భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు విషయంలో వ్యక్తిగత శ్రద్ధ పెట్టి,  నిర్దుష్ట వ్యవధిలో పూర్తి చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో  ముందుకుసాగడం వల్లనే  ఇంత వేగంగా ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన చొవర, వ్యక్తిగత పర్యవేక్షణ కారణంగానే గత ఏడాది కాలంగా భోగాపుర విమానాశ్రయ నిర్మాణ పనులు రోజూ మూడు షిప్టులలో నిరంతరాయంగా జరిగాయని అంటున్నారు.   ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కూడా భోగాపురం విమానాశ్రయం రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలను ఆరంభించేందుకు రెడీ కావడం ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. సాధారణంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదన దశ నుంచి న  నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఒక్కో సారి అంతకు మించి కూడా సమయం పడుతుంది. ఇందుకు ఉదాహరణ ముంబైలో ఇటీవలే ప్రారంభమైన రెండో అంతర్జాతీయ విమానాశ్రయమే. ఈ విమానాశ్రయం ప్రతిపాదన దశ దాటి, అన్ని అనుమతులూ పొంది..  నిర్మాణం పూర్తి చేసుకుని, ప్రయాణీకులకు అందుబాటులోకి రావడానికి పాతికేళ్లు పట్టింది.  ఇక గత దశాబ్ద కాలంగా  బెంగ‌ళూరులో రెండవ విమానాశ్రయ నిర్మాణం కోసం స్థల అన్వేషణ గత దశాబ్ద కాలంగా ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది.    అయితే అందుకు భిన్నంగా  ఆంధ్రప్రదేశ్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం ఆఘమేఘాల మీద పూర్తయ్యింది. ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో ఆపరేషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ముంబై, బెంగళూరు వంటి నగరాలలో   దశాబ్దాలు పట్టిన పని ఏపీలో   రెండేళ్ల లోపే పూర్తయ్యిందంటే.. అది చంద్రబాబు ఫాస్టెస్ట్ గవర్నెన్స్ ఫలితమే అనడంలో సందేహం లేదు.  

కొండ‌గ‌ట్టు, కోన‌సీమ ఓ ప‌వ‌న్ క‌ళ్యాణ్?

కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయుడి గుడికి ప‌వ‌న్ ద్వారా భారీ విరాళం. ఆ భూరి విరాళంతో ఆలయంలో అభివృద్ధి పనులకు ఆయనే స్వయంగా శంకుస్థాపన చేయడం..ప్ర‌స్తుతం ఈ వార్తలు బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ ఆంజ‌నేయ స్వామి వారంటే ప‌వ‌న్ కి ఎందుకంత ఇష్టం? అని చూస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పినట్లుగా ఆంజనేయ స్వామి వారు కొణిదెల కుటుంబానికి కులదైవం. అందుకు నిదర్శనంగా ప‌వన్ కల్యాణ్ నామధేయంలోని పవన్  ఆంజ‌నేయ స్వామి వారిపేరు. ఔను   ప‌వ‌న సుత హ‌నుమాన్ అని కూడా ఆంజ‌నేయుడ్ని పిలుస్తుంటారు భ‌క్త జ‌నం. వాయుపుత్రుడాయ‌న‌. అంటేపవన్ కల్యాణ్ పేరులో  స‌గం ఆంజ‌నేయ‌స్వామి ఉన్నారు. ఇక పవన్ తల్లి పేరు అంజనా దేవి. ఆ పేరులోనూ ఆంజనేయుడు ఉన్నారు.    అందుకే కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.   అదే బీఆర్ఎస్ గ‌తంలో ఇదే  కొండ‌గ‌ట్టు ఆలయానికి  వంద కోట్ల మేర నిధులు  ప్ర‌క‌టించి ఇవ్వ‌లేదు. అదే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవన్ కల్యాణ్.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలోనూ, దైవ భక్తికి రాష్ట్రాల హద్దులు ఉండవని చాటడంలోనూ ముందున్నారు.  ప‌వ‌న్  ఏపీకి చెందిన రాజ‌కీయ నాయ‌కుడైనా.. తెలంగాణ‌లోని కొండ‌గ‌ట్టుకు విరాళం ఇప్పించ‌డం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హర్షం వ్యక్తం అవుతోంది. తెలంగాణ వాసులు అయితే మరో అడుగు ముందుకేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైన బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు కూడా.   పవన్ కల్యాణ్ గ‌తంలో ఇక్క‌డి నుంచే త‌న వారాహీ వాహ‌న యాత్ర‌ను లాంఛ‌నంగా మొద‌లు పెట్టారు. అదీ హనుమంతుల వారిపై ఆయనకు ఉన్న భక్తి. అది పక్కన పెడితే ఇక్కడ మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. గ‌తంలో ఆయ‌న కోన‌సీమలో కొబ్బరి రైతులు నష్టాలు పాలుకావడంపై మాట్లాడుతూ..  తెలంగాణ ప్ర‌జ‌ల దిష్టి త‌గిలింద‌ని చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే.  ప‌వ‌న్ యాంటీ తెలంగాణ అన్న మాట కూడా అప్పట్లో గట్టిగా వినిపించింది. అదే ఇప్పుడు తెలంగాణ ప్ర‌జ‌ల ఆరాధ్య దైవ‌మైన కొండ‌గ‌ట్టు హ‌నుమ‌న్న ఆల‌యానికి కోట్ల రూపాయ‌ల విరాళం వ‌చ్చేలా చేసి.. త‌న‌పై వ‌చ్చిన యాంటీ తెలంగాణ కామెంట్స్ ని చెరిపేసుకున్నారు పవన్ కల్యాణ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజనులు పేర్కొంటున్నారు.  

దొంగే దొంగా దొంగా అని అరచినట్లుగా జగన్ తీరు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ హయాంలో  తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో ఇప్పటికే వైసీపీ నాయకులు పలువురు పీకలోతు ఇరుక్కున్నారు. కొందరు అరెస్టయ్యారు కూడా. మరి కొందరు విచారణలను ఎదుర్కొంటున్నారు. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో  తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ వెనుక ఉన్నది వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపంపై పిటిషన్ దాఖలు చేయాలంటే  ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలి. కానీ తాజాగా తెలంగాణలో  పిటిషన్ దాఖలైంది. ఔను తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ పిటిషన్ దాఖలు కావడం  విన‌డానికి ఆశ్చ‌ర్య‌కంగా ఉన్నావాస్తవం. నిజానికి  క‌మిష‌న్ల క‌క్కుర్తితో  తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో  కల్తీ నెయ్యి వినియోగం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగనే వెనకుండి తెలంగాణ హైకోర్టులో ఇలా ఎదురు పిటిషన్ వేయించడమేంటన్న విస్మయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.   జగన్ హయాంలో తిరుమల కేంద్రంలో సర్వ అనర్ధాలూ జరిగాయన్న విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే.  ఇక పరకామణి చోరీ వ్యవహారంలో ఫిర్యాదు దారుడైన   ఏవీఎస్వో స‌తీష్ హ‌త్య జగన్ హయాంలో తిరుమలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, తిరుమల పవిత్రతను దెబ్బతీసే చర్యలూ యథేచ్ఛగా జరిగాయనడానికి నిదర్శనంగా చెబుతున్నారు పరిశీలకులు.  ఆయన హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలే.. కనీసం విపక్ష హోదా లేకుండా వైసీపీ ఘోర పరాజయం కావడానికి కారణమని శ్రీవారి భక్తులు భావిస్తున్నారు.    జ‌గ‌న్ హ‌యాంలో తిరుమ‌ల కేంద్రంగా జ‌రిగిన అక్ర‌మాల సంగతి కాసేపు పక్కన పెట్టి..  తెలంగాణ హైకోర్టులో తిరుమల ప్రసాదాల నాణ్యతపై దాఖలైన పిటిషన్ లోని అంశాలను గమనిస్తే..  ఆగ‌మ‌శాస్త్రం ప్ర‌కారం స్వామివారికి నైవేద్య సంత‌ర్ప‌ణ జ‌ర‌గ‌డం లేద‌న్న‌ది ఈ పిటిష‌న్లోని ప్ర‌ధానాంశం. పిటిష‌న్ త‌ర‌ఫు సుశీలారాం అనే న్యాయ‌వాది   వాద‌న‌లు వినిపించారు. గ‌తంలో టీటీడీ ఆమోదించిన తీర్మానాల‌ను ఈ బోర్డు తుంగ‌లో తొక్కింద‌న్న‌ది మరో ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అయితే ఈ వాద‌న‌లు విన్న ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అప‌రేశ్ కుమార్ సింగ్, జ‌స్టిస్ జీఎం మొయినుద్దీన్ తో కూడిన ధ‌ర్మాస‌నం విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లారా? అని ప్రశ్నించింది. దీనిపై  తాము మౌఖికంగా టీటీడీ బోర్డుకు విన్న‌వించిన‌ట్టు చెప్పారు పిటిష‌న‌ర్ కే. శివ‌కుమార్. భ‌క్తుల విశ్వాసాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని.. ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోవ‌ల్సిందిగా కోరారు పిటిష‌న‌ర్. అయితే ఈ పిటిష‌న్ ప‌ట్ల కోర్టు రిజిస్ట్రీ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో కోర్టు పటిషన్ విచారణార్హతపై త‌న నిర్ణ‌యం వాయిదా వేసింది.   వైవీ సుబ్బారెడ్డి, భూమ‌న వంటి  అన్యమతస్థులను టీటీడీ బోర్డు చైర్మ‌న్లుగా నియ‌మించిన జ‌గ‌న్..  అలాగే శ్రీవారి  ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం, శాలువాల కుంభ‌కోణం, శ్రీవాణి టికెట్ల‌కు లెక్క‌లు చూప‌క పోవ‌డం, ప‌ర‌క‌మాణి చోరీ,  స్విమ్స్ ఆస్ప‌త్రుల్లోని మెడిక‌ల్ షాపుల నుంచి నెల‌కు రూ. 40 ల‌క్ష‌ల మేర వ‌సూలు చేయ‌డం ఇలా ఎన్నోఅవకతవకలు జగన్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు కావడంపై సర్వత్రా విస్మయం, ఆగ్రహం వ్యక్తమౌతోంది.  అన్న‌దానంలో నాసిర‌కం స‌రుకులు,  క్యూలైన్ల‌లో భ‌క్తుల‌కు ఇవ్వాల్సిన సాంబార్ రైస్, పెరుగ‌న్నం, పాలు వంటివి ఇవ్వ‌కుండా ఆప‌డం.. వంటి ప‌లు సంఘటనలు జరిగింది జగన్ హయాంలోనే కదా అని భక్తులు కూడా అంటున్నారు.  కొండ మీదే కాదు కొండ కింద గోవింద‌రాజుల స్వామి వారి ఆల‌య గోపుర బంగారు తాప‌డంలోనూ త‌మ చోర‌ బుద్ధి చాటింది జ‌గ‌న్ అండ్ కో. ఈ మొత్తం గోపుర తాప‌డంలో 69 కోట్ల విలువైన బంగారం కొట్టేసిన‌ట్టు తేలింది. ఇదే గోపురంపై ఉన్న ముప్పై రెండు విగ్ర‌హాల విధ్వంసానికి కూడా కార‌కుల‌వ‌డం మ‌రో అప‌చారం.. ఇక వ‌రాహ స్వామి వారి గోపురం బంగారు తాప‌డంలో లిక్విడ్ రూపంలోనూ బంగారం కొట్టేయ‌డం వంటి ఎన్నో కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి.  బ్రిటిషర్ల హ‌యాంలో కూడా తిరుమల వేంకటేశ్వరుడి విషయంలో ఇలా అపచారాలు జరగలేదని పండితులు  అంటున్నారు. అయితే జగన్ హయాంలో మాత్రం తిరుమల పవిత్రతను మంటగలిపేలా అపచారాలు జరిగాయని అంటున్నారు. ఆ అరాచకాలన్నీ ఒక్కటొక్కటిగా ఇప్పుడు బయట పడుతుం డటంతో..   హిందూ ఓటు బ్యాంకు దూరమైపోతోందన్న భయంతోనే జగన్ తిరుమల పవిత్రత విషయంలో ఎక్కడ లేని అక్కరా కనబరుస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  తన హయాంలో చేయాల్సిందంతా, చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అంటూ   శ్రీవారికి ఆగమశాస్త్రం ప్రకా రం నైవైద్య నివేదిన జరగడం లేదంటూ కోర్టును ఆశ్రయించడం వెనుక ఉన్నది కేవలం రాజకీయమే కానీ,  శ్రీవారిపై భక్తితో కాదని అంటున్నారు.  

వైసీపీ వారికి అప్ప‌నంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు!?

వడ్డించేవాడు మనవాడైతే భోజనానికి చివరి పంక్తిలో కూర్చున్నా ఫరవాలేదన్నది సామెత. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో ఆ సామెతను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు, కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు. ఇప్పుడు ఆ సామెతను వడ్డించేవాడు మనవాడే ఉన్న మొదటి మొదటి పంక్తిలో కూర్చున్నా లాభం లేని పరిస్థితి ఏర్పడిందని మార్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు. ఔను తిరుమలలో  వైకుంఠ ఏకాద‌శి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాల విషయంలో వైసీపీయులదే హవా అంటున్నారు. వైసీపీ లీడర్లకు ఉత్తర ద్వార దర్శనాలను తిరుమల అడిషనల్ ఈవో దగ్గరుండి మరీ చేయిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేస్తున్నారు.  తెలుగుదేశం కూటమి సర్కార్ లో కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వారికి దక్కని వైకుంఠ ద్వార దర్శనాలు వైసీపీ నేతలకు మాత్రం అధికారులు దగ్గరుండి మరీ తీసుకువెళ్లి దర్శనం చేయించ డమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజ‌య‌వాడ  నుంచి వ‌చ్చిన‌దేవినేని అవినాష్‌, మ‌ల్లాది విష్ణుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వంటి  వారు మంగళవారం (డిసెంబర్ 30)న తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సరే  పెద్దిరెడ్డి అంటే లోక‌ల్. మరి మ‌ల్లాది, దేవినేని సైతం వైకుంఠ ద్వారా  ద‌ర్శ‌నాలు అల‌వోక‌గా ఎలా చేసుకోగలిగారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా వైసీపీ వారి మాటే ఇంకా తిరుమలలో చెల్లుబాటు అవుతోందనడానికి ఇంత కంటే నిరద్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారు.. అధికారం కోల్పోయినా వైసీపీ వారి పనులు యథేచ్ఛగా నడుస్తున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేననడానికి  వైకుంఠ ఏకాదశి సందర్భంగా  వైసీపీయులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దగ్గరుండి మరీ ఉత్తరద్వార దర్శనాలను కల్పించడమే  నిదర్శనమని అంటున్నారు.