తెలంగాణలో రిటైర్డ్.. ఏపీలో జాబ్
posted on Sep 11, 2015 @ 12:22PM
తెలంగాణలో పదవి వీరమణ పొందిన 20 మంది ఉద్యోగులకు మళ్లీ ఏపీలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించింది. ఎందుకంటే రాష్ట్రాలకు ఉద్యోగులు కేటాయింపులకు ఏర్పాటు చేసిన కమల్ నాథన్ కమిటీ స్థానికత ఆధారంగా ఇరవై మంది ఉద్యోగులను ఏపీకే కేటాయించింది. అయితే తెలంగాణలో పదవీ విరమణ కాలం 58 సంవత్సరాలు.. ఏపీ లో 60 సంవత్సరాలు ఉండటంతో ఈ ఇరవై మందికి మరో రెండేళ్లపాటు ఉద్యోగ అవకాశం కలిగింది. దీనికి ఏపీ ప్రభుత్వ కూడా అంగీకరించడంతో వారికి ఏపీ జైళ్ల శాఖలో ఉద్యోగం కల్పించింది.
ఇదిలా ఉండగా ఈ ఉద్యోగుల కేటాయింపులపై కమల్ నాథన్ కమిటీ కసరత్తులు చేస్తూనే ఉంది. దీనిలో భాగంగానే ఈ కమిటీ రెండు ప్రభుత్వాల సీఎస్ లతో కూడా భేటీ అయింది. అయితే 40 శాఖల్లోని ఉద్యోగుల పేర్లతో ఈ తుది కేటాయింపులో వచ్చిన అభ్యంతరాలను ఈ కమిటీ ఇప్పటికే పరిష్కరించే పనిలో పడింది. త్వరలోనే తుది కేటాయింపులు జరగబోతాయని కమిటీ తెలిపింది.