సీనియర్లకు షాక్.. కెప్టెన్ ఛేంజ్.. న్యూజిలాండ్ టూర్‌కు నయా టీమిండియా..
posted on Nov 12, 2021 @ 4:02PM
టీ20 వరల్డ్ కప్‌లో అట్టర్‌ఫ్లాప్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఫెయిల్యూర్. ఇక టీమిండియా పనైపోయిందంటూ టాక్. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పించుకున్నారు. ఇలా అన్నివైపుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న ఇండియన్ టీమ్.. త్వరలో జరగబోవు న్యూజిలాండ్ టూర్‌కు సిద్ధం కావాల్సి ఉంది. కివీస్‌తో టెస్టు సిరీస్ కోసం కొత్త జట్టును ప్రకటించింది బీసీసీఐ. సీనియర్లకు రెస్ట్ పేరుతో షాక్ ఇవ్వగా.. యువ ఆటగాళ్లలో టెస్టు జట్టును నింపేయడం సాహసమనే చెప్పాలి.
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు.. నాన్‌స్టాప్‌గా మ్యాచ్‌లు ఆడుతున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి లాంటి కీలక ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అంజిక రహానెకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఛెతేశ్వర్ పుజారాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. రెండో టెస్టుకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ ప్రకటించింది. అంటే, తొలి టెస్ట్ మ్యాచ్‌కు మాత్రమే రహానె కెప్టెన్ అన్నమాట.
టీమిండియా జట్టు ఇదే...
అజింక్య రహానె (కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ.