టీమిండియా రికార్డుల జోరు.. వారెవా భలే హైలైట్స్..
posted on Nov 6, 2021 @ 10:53AM
టీమిండియా దుమ్మురేపింది. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఇరగదీసింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బౌలర్లు బెంబేలెత్తించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (50; 19 బంతుల్లో 6x4, 3x6), రోహిత్ శర్మ (30; 16 బంతుల్లో 5x4, 1x6) దంచికొట్టారు. సెమీస్ రేసులో నిలవాలంటే స్కాట్లాండ్ ఇచ్చిన టార్గెట్‌ను 7.1 ఓవర్లలో భారత్ ఛేదించాల్సి వచ్చింది. దీంతో ఓపెనర్లు దొరికిన బంతిని దొరికినట్టు బాదేశారు. టీమిండియా 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. మనోళ్ల జోరుకు పలు ఆసక్తికర రికార్డులు నమోదయ్యాయి. టీమిండియా తాజాగా నెలకొల్పిన రికార్డులివే...
--టీ20 ఫార్మాట్ పవర్‌ప్లేలో భారత్ సాధించిన అత్యధిక స్కోరు (82/2).
--టీ20ల్లో ఎక్కువ బంతులు (81 బంతులు) మిగిలుండగానే టీమ్‌ఇండియా సాధించిన అత్యుత్తమ విజయం.
--కేఎల్ రాహుల్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ. 2007లో యువరాజ్ సింగ్ (12 బంతుల్లో అర్ధ శతకం) తర్వాత టీమ్‌ఇండియాకిదే వేగవంతమైన అర్థశతకం.
ఇలాంటివే గతంలోనూ పలు ఆసక్తికర విజయాలు సాధించింది టీమ్ఇండియా. అవేంటంటే...
2016లో మీర్పూర్ వేదికగా యూఏఈ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 59 బంతులు మిగిలుండగా విజయం సాధించింది. 2016లోనే హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 41 బంతులు మిగిలుండగా గెలిచింది. 2014లో చిట్టగాంగ్ వేదికగా నెదర్‌లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 90 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్‌లోనే దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడిన ఆస్ట్రేలియా 82 బంతులు మిగులుండగా విజయం దక్కించుకుంది.
శుక్రవారం రాత్రి దుబాయ్ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పవర్‌ప్లే స్కోర్ 82/2. టీ20 పవర్‌ప్లేలో టీమ్‌ఇండియా అత్యధిక స్కోర్ ఇదే. గతంలో 2018లో జోహెనస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పవర్‌ప్లే స్కోర్ 78/2 తర్వాత ఇదే హైయెస్ట్ స్కోర్.