సీమాంధ్రలో 120 నుంచి 140 సీట్లు ఖాయం: చంద్రబాబు
posted on May 8, 2014 @ 1:22PM
సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన తర్వాత తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెరిగిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. పోలింగ్ పూర్తవగానే టీడీపీ విజయం ఖాయమని సగర్వంగా ప్రకటించిన ఆయన, గురువారం నాడు మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రలో తమ పార్టీ 120 నుంచి 140 అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని చెప్పారు. అలాగే 20నుంచి 22 పార్లమెంటు సీట్లు తెలుగుదేశం ఖాతాలో పడబోతున్నాయని చెప్పారు.
ఈ పోలింగ్‌లో కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీలు అడ్రస్ లేకుండా పోయాయని, వైకాపా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించిందని ఆయన చెప్పారు. సీమాంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని చంద్రబాబు చెప్పారు. బీజేపీకి ఓటు వేశానని బయటకి చెప్పినందుకే తన ఓటు చెల్లదని చెప్పిన ఎన్నికల కమిషన్‌కి జగన్ కుటుంబ సభ్యులు మాట్లాడిన మాటలు వినిపించలేదా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని చంద్రబాబు విమర్శించారు.