కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు
posted on Aug 18, 2015 @ 5:26PM
తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శోభారాణి తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శల బాణాలు సంధించారు. కేసీఆర్ కు ఇప్పటికే కాలేయం పాడైందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు అతి తక్కువ ధరకే మద్యం అందుబాటులోకి తీసుకొచ్చి.. ఇప్పుడు చీప్ లిక్కర్ తాగించి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడతారా అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని లిక్కర్ మాఫియా చేతిలో పెట్టబోతున్నారని.. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా త్వరలో మేము బయటపెడతామని ఆమె ఆరోపించారు. అంతేకాదు వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే కెసిఆర్ చేశారని గుర్తుంచుకోవాలన్నారు.