టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత..
posted on Oct 23, 2021 @ 8:55PM
తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూశారు. మధ్యాహ్నం ఆయనకు గుండె నొప్పి రావడంతో ప్రయివేట్ ఆసుపత్రి లో చేరారు. అయితే వైద్యం అందిస్తుండగానే.. సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచారు కాట్రగడ్డ బాబు.
గత 25 ఏళ్లుగా బెజవాడ నగరంలో టీడీపీ పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగారు కాట్రగడ్డ బాబు. దశాబ్ద కాలంగా పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. క్లిన్ అండ్ గ్రీన్ వంటి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు ఆయన నిత్యం అందుబాటులో వుండేవారు. కాట్రగడ్డ బాబు మృతిపట్ల టీడీపీ నేతలు తీవ్ర సంతాపం తెలిపారు.