ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు టీచర్లకు టీడీపీనే భరోసా.. లోకేష్ హామీ ఇదే!
posted on Feb 16, 2023 @ 5:21PM
దేశంలో అన్ని రాష్ట్రాల్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా విద్యారంగంలో ప్రైవేట్ శాతం ఎన్నో రెట్లు పెరుగుతూ వస్తోంది...ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్థాయి విద్యా ప్రమాణాలు అందించగలిగితే కచ్చితంగా స్వాగతించాల్సిందే... కానీ అలా చెప్పుకుపోవడం తప్ప ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రభుత్వం వైపు నుండి జరగడం లేదు అనేది సుస్పష్టం. ముఖ్యంగా వైసీపీ పార్టీ ఆర్థికారంలోకి వచ్చాక... ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశపెడుతున్నాం... ఉన్నత వర్గాలేనా ఇంగ్లీషు చదివేది... పేదల పిల్లలు చడవకూడడా అంటూ రాగాలు తీశారు. కానీ అమలులో మాత్రం ఆల్రెడీ ఉపాధ్యాయులుగా చేస్తున్న వారికి కనీస శిక్షణ ఇవ్వకపోగా ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వం వేధిస్తున్న తీరు చూస్తున్నాం. ఇంగ్లీషు మీడియం ఎలా అమలవుతుందో చూస్తున్నాం.
ఇక ప్రయివేటు విద్యాసంస్థల విషయానికొస్తే... కోవిడ్ కి ముందు కోవిడ్ తర్వాత అన్నట్టే మాట్లాడుకోవాలి. కోవిడ్ కారణంగా అప్పులు తెచ్చి టీచర్లకు జీతాలు ఇస్తూ... మళ్లీ రీ ఓపెన్ చేసి నడిపించే స్థోమత లేక వేలల్లో ప్రైవేట్ స్కూల్స్ మూతపడిన విషయం తెలిసిందే. స్కూలును నడపలేక అప్పులు తీర్చే దారి కనబడక కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో సెల్ఫీ వీడియో తీసుకొని దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల దయనీయ స్థితిని కళ్ళకు కట్టింది.
ఇదంతా ఒక ఎత్తైతే, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రభుత్వ గుర్తింపును 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేయించుకొనే విధానం గత తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తే, ఇప్పుడు వైసీపీసర్కార్ దానిని మూడు సంవత్సరాలు కుదించడం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు గుది బండలా మారింది. ఇదే విషయాన్ని యువగళం పాదయాత్రలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దృష్టికి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తీసుకెళ్లాయి. వారి సమస్యలను సావధానంగా విన్న లోకేష్ వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాత విధానం ప్రకారం ప్రయివేటు స్కూల్స్ గుర్తింపు 3 సంవత్సరాలకు ఒకసారి కాకుండా, 10 సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేసుకునేలా జీవో తీసుకోస్తాం అని లోకేష్ విస్పష్ట హామీ ఇచ్చారు.
ఇక ప్రైవేట్ ఉపాధ్యాయుల విషయానికొస్తే. అదే కోవిడ్ సమయంలో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. కూలీ పనులు చేసుకునో, కూరగాయలు అమ్ముకునో లేదా చందాలు వేసుకొనో ఒకరికొకరు పోషించుకున్న టీచర్లు కూడా ఉన్నారు. ఆ సమయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ టీచర్లకు భృతి ఇచ్చి ఆదుకున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ భృతి కూడా ఇవ్వకుండా వారిని గాలి కొదిలేసింది. ఒకే ఒక్క నిబంధన ప్రైవేట్ టీచర్స్ జీవితాల్లో చీకట్లు నింపింది.
గుర్తింపు పొందిన ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్స్ గా చెయ్యాలంటే... టెట్ క్వాలిఫై కావడం కంపల్సరీ చెయ్యడం వల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఎడ్ చేసినా టెట్ క్వాలిఫై కాని వారు టీచర్లుగా అర్హత కోల్పోతారు.
కొన్ని వేల మంది ఉద్యోగార్థులు. అటు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాక, ఇటు ప్రైవేటు ఉద్యోగమూ చేసుకోలేక కూలీలుగా మారిపోయి తమ తలరాత ఇంతే అనుకుంటూ బతుకీడాల్సివస్తున్నది. ఇక టెట్ క్వాలిఫై అయినా నోటిఫికేషన్లు కోసం ఎదురు చూసి చూసి వయస్సు మీద పడి అర్హత కోల్పోయి... ప్రైవేట్ స్కూల్స్ మీదే ఆధారపడి జీవిస్తున్న వారు ఈపీఎఫ్, ఈహెచ్ఎస్ పరిధిలో తమను చేర్చి తమ జీవితానికి కనీస భరోసా కల్పించమని ఎన్ని సార్లు విన్నవించినా వారిని పట్టించుకున్నా జగన్ సర్కార్ వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవే సమస్యలు జగన్ పాదయాత్రలో కూడా ఆయన్ను కలిసి ప్రస్తావించినప్పుడు నేను అధికారంలోకి వస్తే తప్పకుండా చేస్తాను అని మాట ఇచ్చి... ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కన పెట్టిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానిది కాదా..!
ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు... టీచరు లారా ఆలోచించండి... మీ సమస్యల పరిష్కారానికి, మీ హక్కుల సాధనకై ప్రత్యామ్నాయం నేనౌతా... చట్ట సభల్లో మీ గొంతుకనౌతా అంటూ... భరోసా కల్పిస్తున్నారు పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాం గోపాల్ రెడ్డి.