బాబు స్టయిల్ మారిందా?
posted on Oct 3, 2012 @ 11:40AM
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయడు తన స్టయిల్‌ను మార్చుకున్నారు. నిన్నటి వరకూ ఖాళీగా రెండు వేళ్లను ‘వీ’ సింబల్‌గా చూపిన ఏకైక నేత చంద్రబాబు. తన మామ ఎన్టీఆర్ రెండు చేతులూ ఎత్తి మనస్ఫూర్తిగా చేసే నమస్కారాన్ని ఈయన ఎప్పుడూ అనుసరించలేదు. తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనేది బాబు పాలసీ. ఆ పాలసీ ప్రకారమే ఆయన రెండు వేళ్లను విక్టరీ అన్న అర్థం వచ్చేలా చూపేవారు. ఈయన చూపిన ఈ స్టయిల్ ఎంత పాపులర్ అయిందంటే అట్టడుగు తెలుగుదేశం కార్యకర్త కూడా రెండు వేళ్లు చూపేంత. ఈ స్టయిల్ నేర్చుకోవాలని కొత్తగా పార్టీలో చేరిన వారు కూడా భావించేవారు. రాను రాను ఆ స్టయిల్ పాతబడిందనుకున్నట్లున్నారు చంద్రబాబు. అందుకే మీకోసం వస్తున్నా పాదయాత్రలో కొత్త స్టయిల్‌గా పాతపద్దతిని అనుసరిస్తున్నారు. రెండు చేతులూ కలిపి దణ్నం పెడుతున్నారు. ఇప్పటి దాకా చంద్రబాబు పోస్టర్లు, కటౌట్‌లు కూడా వీ స్టయిల్ ఉండేవి. బాబు తన పాలసీ మార్చుకున్న విషయం ఎవరికీ తెలియదు కాబోలు అనంతపురం జిల్లా హిందుపురంలో వాడిన పోస్టర్లు, బ్యానర్లలో పాతస్టయిల్ కనిపించింది. చంద్రబాబు ఆ బ్యానర్లు గురించి పట్టించుకోలేదు అనుకోండి. కానీ, దణ్నం పెడుతున్న చంద్రబాబు తాను పర్యటించే ప్రాంతాల్లో వచ్చింది బాబేనా అనే అనుమానానికి తావిస్తున్నారు. వీ స్టయిల్ మానేస్తే బాబును గుర్తుపట్టడం కష్టమని తెలుగుదేశం పార్టీ అభిమానులు అంటున్నారు. 63ఏళ్ల చంద్రబాబు తన స్టయిల్ మార్చుకుంటే స్పందన మారుతుందని ఏ సిద్ధాంతైనా శెలవిచ్చారా? లేక వయస్సు ప్రభావమా? ఏమో ఏదేమైనా బాబు ఇప్పుడు నిజంగా పొలిటికల్ ట్రెండ్‌లో తెలుగుదేశం పార్టీలో కొత్తమార్పుకు బీజం వేశారు. విక్టరీ సింబల్ స్థానం దణ్నం పెట్టే సంస్కృతిని ప్రవేశపెడుతున్నారన్నమాట.