ఆట కాదు వేట మొదలైంది.. రేవంత్ రెడ్డి

 

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడికైనా వెళ్లొట్టు అని హైకోర్టు చెప్పిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి తన సొంత నియోజక వర్గం అయిన కొండంగల్ నుండి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ చేరుకున్న ఆయనకు టీడీపీ పార్టీనేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆట ఇప్పుడే మొదలైంది అంటున్నారు మొదలైంది ఆట కాదు వేట అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అంతేకాదు సింగం వచ్చేసరికి కేసీఆర్ టూర్ అంటూ చైనా చెక్కేసారు అని వ్యంగాస్త్రాలు విసిరారు.

రైతులు ఆత్మహత్యలు.. విద్యార్ధుల ధర్నాలు ఇవేమి కేసీఆర్ కు పట్టడం లేదని కేసీఆర్ ప్రభుత్వం నేను పోరాటం చేస్తానని.. ప్రజా సమస్యల పైన ప్రభుత్వం అంతు చూస్తానని అన్నారు. వంద ఎకరాల ఫామ్ హౌస్ పై ఉన్న శ్రద్ధ రైతల మీద లేదని ఎద్దేవ చేశారు.

Teluguone gnews banner