జగన్ దీక్ష డేట్ ఖరారు
posted on Sep 9, 2015 @ 6:00PM
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15న దీక్ష చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే 17 వ తేదీన వినాయక చవితి ఉన్న నేపథ్యంలో విరమించుకున్నారు. అయితే ఈరోజు వైయస్ జగన్ అన్ని జిల్లాల పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో దీక్ష తేదీని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 26 నుండి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్లు.. పార్టీ నేతలతో చర్చించిన తర్వాతనే వైయస్ జగన్ ఈ తేదీని ఖరారు చేసినట్లు తెలిపారు.
ప్రత్యేక హోదా కోసం జగన్ ఇప్పటికే ఢిల్లీలో ధర్నా చేశారు. కొద్ది రోజుల క్రితమే విజయవాడలో కూడా ధర్నా చేశారు. ఇప్పుడు గుంటూరులో నిరహారదీక్ష. మరి జగన్ దీక్షలు ఎంతవరకూ పని చేస్తాయో చూద్దాం.