చంద్రబాబుకు పెద్ద షాక్.. టీడీపీకి ఆ సీనియర్ నేత గుడ్ బై
posted on Jun 9, 2020 @ 4:13PM
గత కొద్ది రోజులుగా టీడీపీ ఖాళీ అయిపోతోంది, ఎమ్మెల్యేలు అందరూ జంప్ అని సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. కొద్ది రోజుల క్రితం 10 మంది కి పైగా ఎమ్మెల్యేలు గోడ దూకడానికి రెడీగా ఉన్నారని ఎమ్మెల్యే కరణం బలరాం బాంబు పేల్చారు. అంతకు కొద్ది రోజుల కు ముందు ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ గారి చేత కండువా కప్పించుకునేందుకు సిద్ధం అని అన్ని మీడియాలలో వార్తలు వచ్చాయి. కానీ కారణాలేమైనా అవి నిజం కాలేదు.
ఐతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రకాశం జిల్లా సీనియర్ నేత శిద్దా రాఘవ రావు తన కుమారుడితో కలిసి రేపు వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. ఐతే దీని వెనుక వ్యాపార కారణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. గడచిన కొన్ని నెలలుగా ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి లోని గ్రానైట్స్ సంస్థల పై అధికారుల వేధింపులు ఎక్కువైనట్లుగా వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సంస్థల పై దాడులు జరుగుతన్నాయని ఇవి ఆగాలంటే అధికార పార్టీ వారిని సంప్రదించాలని ఆ అధికారులు తెలిపినట్లుగా సమాచారం.