జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్
posted on Jun 9, 2020 @ 4:34PM
బీజేపీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియాకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం వారిద్దరికీ ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో నాలుగు రోజుల క్రితమే జ్యోతిరాదిత్య ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన తల్లి మాధవిలో కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ.. వైద్య పరీక్షలు జరపగా ఆమె కరోనా పాజిటివ్ అని తేలింది.
మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య కీలక నేత. మార్చి నెలలో ఆయన కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. ఆయన వెంట పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడంతో కమల్‌నాథ్ సర్కారు కూలిపోయి.. శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయ్యారు. కాగా, పార్టీలో చేరిన వెంటనే జ్యోతిరాదిత్యను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది.