పేదల కష్టాలు తీర్చండి! టిడిపి నేత కోటంరెడ్డి!
posted on Apr 16, 2020 @ 7:04PM
ప్రతి పేద కుటుంబానికి 5 వేల రూపాయలు, మూడు నెలలు ఉచితంగా కరెంట్ సరఫరా, అలాగే 3 నెలల పాటు ఉచితం గా వంట గ్యాస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టిడిపి నేత కోటంరెడ్డి డిమాండ్ చేశారు. మీరేమో లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు, పేదోళ్లకు మాత్రం రూ.5 వేలు ఇవ్వలేరా అంటూ ముఖ్యమంత్రి జగన్ ని ఆయన ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరులోని తన నివాసంలో ఒక రోజు దీక్షను చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి తరుణంలో ప్రభుత్వం పేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు ఐదు వేల రూపాయలు అందివ్వాలని , రెడ్ జోన్ ప్రాంతాల్లో నిత్యావసర సరకులు ఉచితంగా పంపిణీ చేయాలని, 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే బిల్లులను రద్దు చేయాలని, ఉచితంగా గ్యాస్ అందించాలని ఈ సందర్భంగా కోటంరెడ్డి డిమాండ్ చేశారు.
ఒక్క రోజు దీక్ష చేపట్టిన కోటంరెడ్డికి సంఘీభావంగా పలువురు టిడిపి నేతలు వారి నివాసానికి చేరుకుని మద్దతు తెలిపారు. భౌతిక దూరం పాటించి దీక్షలో పాల్గొన్నారు.