గుంటూరు డీసీసీబీ, డీసీఎంఎన్ టిడిపి కైవసం

 

 

 

 

గుంటూరు జిల్లా సహకార బ్యాంకు ఎన్నికల్లో టిడిపి విజయభేరి మోగించింది. శుక్రవారం జరిగిన పోలింగ్ లో టిడిపి 16 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. అభ్యర్ధులు లేక మరో మూడు స్థానాలు ఖాళీగా మిగిలాయి. సహకార మంత్రి జిల్లాలో కాంగ్రెస్ సహకార ఎన్నికలు ఓడిపోవడం ఆ పార్టీకి మింగుడు పడడంలేదు.

 

గుంటూరు జిల్లా కేంద్ర సహకార మార్కెటింగ్ సొసైటీ పాలకవర్గం కూడా టిడిపి దక్కించుకుంది. మొత్తం డైరెక్టర్ల స్థానాలకు గాను టిడిపి 5 , కాంగ్రెస్ 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ 1 స్వతంత్ర అభ్యర్ధులు ఒకటి చొప్పున చేజిక్కించుకున్నారు. మరో రెండు చోట్ల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ టిడిపి కి మద్దతివ్వడంతో పాలకవర్గం టిడిపి కైవసం చేసుకుంది. 

 

Teluguone gnews banner