జగన్ మేనమామ కి బెయిల్ మంజూరు
posted on Mar 1, 2013 @ 5:15PM
జగన్ మోహన్ రెడ్డి మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కడప మొదటి అదనపు సివిల్ జడ్జ్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఫోర్జరీ చేసిన కేసులో రవీంద్రనాథ్ రెడ్డి అరెస్టయిన విషయం తెలిసిందే. రవీంద్రనాథ్ రెడ్డిని పోలీసులు ఒకరోజు తమ కస్టడీలోకి తీసుకొని విచారించారు. విచారణలో అతను తనకు ఏమీ తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు రవీంద్రనాథ్ రెడ్డి చేత నిజం చెప్పించేందుకు లై డిటెక్టర్, నార్కో పరీక్షలు, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలకు అనుమతి కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ కోర్ట్ ఈ నెల 4వ తేదికి వాయిదా వేసింది.