వాళ్ళది కాలకేయ సైన్యం.. మనదేమో కాలక్షేప కూటమి...
posted on Apr 18, 2020 @ 8:27PM
* అధినేత తీరుపై టీ డీ పీ అభిమానుల ఆవేదన
* కాన్ఫరెన్సులు పక్కనపెట్టి, కార్యకర్తలను పట్టించుకోండి
* ఓడిపోయి ఏడాది దాటినా, లెసన్స్ నేర్చుకోకపోతే ఎలా అంటూ క్లాస్
* వారం ముందు టముకేస్తే, ఎంత మంది హంగామా బాబులు ఆ కాల్ లోకి వచ్చారో...
"ఓడిపోయి ఏడాది అయినా ఇంకా గుణపాఠాలు నేర్చుకోకపోతే ఎలా సామీ....ముందు కార్యకర్తలతో మాట్లాడి ఆ తర్వాత జనంతో మాట్లాడుకుంటే సరిపోయిద్ధి గానీ అధికారం పోయాక కూడా ఇంకా #TeluguDiaspora అని మమ్మల్ని కూడా గుంపులో గోవిందయ్యల్ని చేయమని సలహా ఇచ్చిన ఆ సన్నాసుల్ని పడేసి తంతేగానీ తెలుగుదేశం పార్టీకి మంచిరోజులు రావు...వారం ముందునుంచే Zoom Call Zoom Call అని టముకు వేసుకుంటే ఎంతమంది ఫెక్ గాళ్ళు ఆ కాల్ లో కొచ్చారో..." ఇది ఒక తెలుగుదేశం అభిమాని పేస్ బుక్ ఆవేదన.
చంద్రబాబు నాయుడు ఇంకా ఆ భ్రమల్లోనే ఉన్నారా... మందీ మార్బలం చుట్టూ ఉంటె చాలన్నట్టుందా ఆయనకు... టీ డీ పీ అభిమానులను ఇది ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న.... ఈ రోజు -విదేశాల్లో ఉన్న తెలుగు వారితో టీడీపీ అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా అంశంపై వారితో చర్చించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 1,000 మంది ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. అమెరికా, సింగపూర్, మలేషియా, దుబాయ్, లండన్, కెనడా నుంచి పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆయా దేశాల్లో తెలుగువారి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. విదేశాల్లో ఉన్న తెలుగువారందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలోని పరిస్థితిని కూడా చంద్రబాబు వారికి వివరించారు. సరిగ్గా ఆ వీడియో కాన్ఫరెన్స్ గురించే తెలుగుదేశం అభిమాని అంతరంగాన్ని పేస్ బుక్ లో వ్యక్తం చేశారు. అలాగే, ఇటీవలే డిజిటల్ కార్పొరేషన్ పదవి పొందిన చిన్నా వాసుదేవ రెడ్డి 2014 లో టీ డీ పీ లోనే ఉన్నాడని ఆ అభిమాని గుర్తు చేశాడు.
"వాసుదేవ రెడ్డి కి పదవి వచ్చిందని ఏడ్చే టీ డీ పీ కార్యకర్తల్లో ఎంతమందికి తెలుసు 2014లో మన కూటమిలో వున్నాడు తాను & రాజంపేట ఎం.పి. అభ్యర్థిగా చివరి నిముషం వరకు రేసులో ఉన్నాడని... మన కోసం పనిచేసిన ఎందరినో మనం అధికారంలో వున్నప్పుడు లెక్క చేయలేదు..అందులో కొందరు తెలివిగా క్యాంప్ మారి వారి తెలివితేటలతో స్ట్రాటజీలు రచించి వాళ్ళ గెలుపులో కీలకం అయ్యాడు కాబట్టి పదవి ఇచ్చాడు....#2019 ఎన్నికల సమయంలో మన కాంపౌండ్లో ఎంతమంది వాళ్ల విషపురోగులు కూర్చోవడం తో , మన నాయకుడిని ఎవరెవరు ఎపుడెప్పడూ కలిసేది కూడా వాళ్ళకి తెలిసిపోయేది..మనమేమో భజనలో కళ్లు మూసుకున్నాం..వాళ్లేమో వాళ్ళ కోసం తగలబెట్టేదానికి అయినా, తమని తాము తగలబెట్టుకునేదానికి అయినా సిద్ధపడే #కాలకేయసైన్యం ని తయారు జేసుకున్నారు." అంటూ ఆ అభిమాని తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం తీరు తెన్నులపై బహు చక్కని విశ్లేషణ అందించారు. ఇంతకీ, ఆయన చెప్పొచ్చేది ఏంటంటే, తెలుగుదేశం ఆత్మ శోధన, అంతఃశోధన చేసుకోవాల్సిన సమయాన్ని ఇలా diaspora ల పేరిట వెచ్చిస్తే, సామాన్య కార్యకర్తలను ఇంకెప్పుడు పట్టించుకుంటారని!!