బెజవాడలో టిడిపి మహాధర్నా
posted on Aug 25, 2012 @ 7:44PM
కృష్ణా డెల్టాకు నీటివిడుదలకోసం టిడిపి చేపట్టిన మహాధర్నాకి అనూహ్య స్పందన లభించింది. విజయవాడలో టిడిపి, సిపిఐ మహాధర్నా నిర్వహించాయి. పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరికి ర్యాలీగా వెళ్తున్న రైతులు, పార్టీల నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజీని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల్ని ఆదుపులోకి తీసుకోవడంతో రెచ్చిపోయిన రైతులు పోలీసుల వాహనాల్ని అడ్డుకున్నారు. టిడిపి నేతలు పోలీసుల వాహనాలకు అడ్డంగా పడుకోవడంతో చాలాసేపటివరకూ ఉద్రిక్త వాతావరణ ఏర్పడింది. టిడిపి నేతలు,
పోలీసులకు మధ్య పెద్దఎత్తున వాగ్వాదం జరిగింది.