మంచినీళ్లిప్పించండి మహప్రభో..!
posted on Aug 25, 2012 @ 8:00PM
ఆల్మట్టినుంచి భారీ ఎత్తున నీటిని కిందికి విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కర్నాటక సీఎం జగదీష్ షెట్టర్ కి లేఖ రాశారు. వర్షాభావం వల్ల 8 జిల్లాల్లో తాగునీటికి సమస్య ఏర్పడిందని, 3 కోట్లమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. కర్నాటక నీటిని విడుదల చేస్తే సమస్య పరిష్కారమౌతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.