చంద్రబాబుతో ఎవరు ఎక్కువ నడిచారు
posted on Oct 16, 2012 @ 12:09PM
తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ తమ నేతతో ఎవరు ఎక్కువ నడిచేరన్నదే. దీనికి కొలమానం ఏమిటో తెలుసా ఎవరు ఎక్కువ నల్లబడితే వారే ఎక్కువ నడిచినట్లట. చంద్రబాబు అనంతపురం జిల్లాలో 13 రోజుల పాటు పాదయాత్ర చేశారు. దీన్లో ఎక్కువగా నడిచింది పయ్యావుల కేశవ్. తరువాత చంద్రబాబు పాదయాత్ర చేస్తూ కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో పల్లె రఘునాథరావు ఉదయం, సాయంత్రం చల్లబడిన తరువాత చంద్రబాబునాయుడుతో అడుగులు కలిపేవారు. ఇంకో విషయమేమంటే ఈయనకు సంబందించిన నియోజక వర్గం చంద్రబాబు రూట్ మ్యాప్ లో లేదు. దాంతో మార్నింగ్, ఈవెనింగ్ వాక్ వెళ్లినట్లు వెళ్లేవారు. వీరిద్దరికంటే తానే ఎక్కువ దూరం నడిచానని టిడిపి జిల్లా అధ్యకుడు పార్ధసారధి చెప్పుకున్నారు. అలా అయితే ఎందుకు నల్లబడలేదని సహచరులు అడిగిన ప్రశ్నకు "కమిలి నల్లబడిన చర్మం ఊడిపోయి కొత్తచర్మం వచ్చి ప్రెష్ గా ఉన్నా' 'అంటూ చమత్కరించారు. ఎవరైనా తెల్లబడేందుకు లోషన్లు వాడతారని అయితే తానే పార్టీనాయకునితో ఎక్కువ నడిచానని చెప్పటానికి గానూ కేశవ్ నల్లబడే లోషన్ రాసుకున్నారంటూ పయ్యావులకేశవ్ పై సెటైర్లు కూడా వేశారు పార్థసారథి.