గూగుల్ నుంచి అద్భుత ట్యాబ్లెట్ పీసీ ‘ట్యాంగో’
posted on Jun 7, 2014 6:57AM
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ రంగంలో రారాజు గూగుల్ కంప్యూటర్ ఉపకరణాల రంగంలో కూడా తన ముద్రని వేయడానికి ప్రయత్నిస్తోంది. సాంకేతికంగా ఒక అద్భుతంలా వుండే ట్యాబ్లెట్ పీసీని త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ ట్యాబ్ పేరు ‘ట్యాంగో’. ఈ ఏడాది చివరికల్లా ‘ట్యాంగో’ మార్కెట్లోకి వచ్చే అవకాశం వుందని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌విడియా టెగ్రా కె1 ప్రాసెసర్‌తో ‘ట్యాంగో’ రూపొందింది. అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, వైఫై, 4జీ దీనిలో ఇతర ప్రత్యేకతలు. నిర్మాణాలు, రోడ్లు, కదిలే వస్తువులు, వ్యక్తులు ఎంత దూరంలో ఉన్నారు, పరిమాణం.. ఇలా పరిసరాలను పూర్తిగా అర్థం చేసుకునేలా ట్యాబ్లెట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పరిసరాలను 3డీలో స్కాన్ చేసేందుకు వీలుగా మోషన్ ట్రాకింగ్ కెమెరాలు మూడింటిని వెనుకవైపు అమరుస్తున్నారు. సెకనుకు 2.5 లక్షలకుపైగా 3డీ కొలతలను ఇవ్వగలదు. మొబైల్ 3డీ సెన్సింగ్ రంగంలో పనిచేసేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. తొమ్మిది దేశాలకు చెందిన యూనివర్సిటీలు, పరిశోధనశాలలు, పరిశ్రమ నిపుణులతో కూడిన బృందం దీని అభివృద్ధిలో నిమగ్నమయ్యారు. ధర రూ.60 వేలు.