సిలిండర్ పై 20 లక్షలు.. తగలబెట్టిన తహసీల్దార్..
posted on Mar 26, 2021 @ 10:20AM
అప్పుడెప్పుడో ఇందిరా గాంధీ తన దగరికి వచ్చిన ఓ గెస్ట్ కి కరెన్సీ తో మంటపెట్టి కాఫీ పెట్టి ఇచ్చారని మాట్లాడుకుంటుంటే విన్నాం. ఇప్పుడు చాలా మంది సరదాకు సెగరెట్ కాలుస్తుంటే చూస్తున్నాం. అప్పుడప్పుడు ఎవరికైన కోపం పక్కవాడి ఒళ్ళు కాలుస్తుంటారు ఆ వార్తలు కూడా విన్నాం. లేదంటే ఆఫీసులో జరిగిన అవినీతిని బయటికి రాకుండా చూడడానికి అకౌంట్ కి సంబందించిన రికార్డ్స్ తగలేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ డబ్బులు ఏరైనా కలుస్తారా.. సరే కాలుస్తారు అనుకుందాం ఎంత 10 రూపాయలు, 100 రూపాయలు, 5000 వేలు కలుస్తారు. మరి 20 లక్షలు ఎవరైనా కాలుస్తారా చెప్పండి..? ఏంటి.. మాట రావడంలేదా.. ఒక వ్యక్తి కాల్చాడు.. నిజంగానే అక్షరాలా 20 కాల్చాడు. అలా అని అది కస్టపడి సంపాదించిన డబ్బు కాదండోయి.. అవినీతి అమ్మకు పుట్టిన.. లంచం డబ్బు.
తను ఒక తహసీల్దారు. అవినీతికి నీరుకట్టే పాము లాంటివాడు. ఎంత అవినీతి పరుడో అంతే తెలివి పరుడు. తెలివి ఉండాలి కానీ అతితెలివి ఉండకూడదంటారు. ఆ తహశీల్ దారు అతితెలివి తనను ఇరకాటంలో పడేసింది. జాలరి వల నుండి తప్పించుకున్న చేప ఎక్కడికైనా వలలో పడినట్టు.. చివరికి తాను ఏసీబీ వలకు చిక్కుకున్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే లంచాలకు అడ్డా అని. ఆ అవినీతి చాపకింద దాగి ఉన్న తిమింగిలాలు, జలగల్ని పట్టుకోవాలని ఏసీబీ వల వేస్తూ. అవినీతి దందాకు అంతిమంగా చెక్ పెడుతోంది. అందులోనే ఏసీబీ రెవెన్యూ శాఖపైనే కన్నేసింది. తాజాగా ఏసీబీ అధికారులు ఓ తహసీల్దారు ఇంట్లో రెక్కీ నిర్వహించడానికి వెళ్లానని నిర్ణయం తీసుకున్నారు. ఇక అంతే తన ఇంట్లో సోదాలు చేస్తున్నారని ముందే పసిగట్టి. తహసీల్దారు అక్షరాలా 20 లక్షలకు నిప్పు అంటించాడు.
తహసీల్దార్ కల్పేష్ కుమార్ జైన్ ఓ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇప్పించాడు. మధ్యవర్తిగా ఉన్న రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ సింగ్ సదరు కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. అయితే ఈ అవినీతిపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కల్పేష్ కుమార్ జైన్ ఇంటి పై దాడులు జరిపారు. ఈ దాడులకంటే ముందు ఏసీబీ అధికారులు వస్తున్నారని సమాచారం అందుకున్న కల్పేష్ కుమార్ ఇంట్లో ఉన్న 20 లక్షల్ని ఇంటిలోపల తాళం వేసి వంటగదిలో గ్యాస్ పై తగలబెట్టాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు తహసీల్దార్ ఇంటి డోర్ ను బలవంతంగా ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూడగా.., జైన్ తగలబెట్టిన కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. దీంతో జైన్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కాలిన నోట్లు కాకుండా విడిగా ఉన్న 1.5లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ లోని సిరోహి జిల్లాలో చోటుచేసుకుంది.