షేమ్ షేమ్ జగన్!.. తాడేపల్లి రే-ప్ కేసులో 2 నెల్ల తర్వాత నిందితుడి ఆచూకీ..
posted on Aug 6, 2021 @ 3:00PM
కాబోయే దంపతులు నదీ తీరంలో విహారానికి వచ్చారు. ఇసుల తిన్నెల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. సాయంసంధ్య వేళలో వెదర్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టుపక్కల జనసంచారం అంతగా లేకున్నా వారేమీ భయపడలేదు. ఎందుకంటే.. సమీపంలోనే ముఖ్యమంత్రి ప్యాలెస్ ఉందిగా.. సెక్యూరిటీ బాగానే ఉంటుందిగా.. తమకేమి భయం అనుకొని బిందాస్‌గా ఉన్నారు. కానీ, వారి అంచనా పొరబాటుగా తేలింది. తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్ సేదతీరుతున్నా.. ఆ సమీపంలోనే తాము విహరిస్తున్నా.. తమకు ఏ మాత్రం రక్షణ లేదనే విషయం ఆ తర్వాత గానీ తెలిసిరాలేదు. అంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది. బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయింది. ఆ జంటపై అటాక్ చేసింది. ఆ యువకుడిని కట్టేసి.. యువతిని చెరబట్టింది. అమానుషానికి పాల్పడి.. ఎంచక్కా వచ్చిన దారినే వెళ్లిపోయింది.
విషయం తెలిసి అంతా షాక్. తాడేపల్లిలో ఈ ఘోరం ఏంటని ఏపీ ఉలిక్కిపడింది. సీఎం జగన్ ఇంటి సమీపంలోనే ప్రజలకు రక్షణ లేకుండా పోవడాన్ని అంతా తప్పుబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ సమీప ప్రాంతాల్లో గంజాయి ముఠాలు, బ్లేడ్ బ్యాచ్‌లు ఇంతలా చెలరేగిపోవడం సర్కారు చేతగానితనమంటూ విమర్శలు ముంచెత్తాయి. ఆ జన చీదరింపుల నుంచి తప్పించుకోడానికే అన్నట్టు.. అప్పటికప్పుడు దిశ యాప్ పేరుతో పెద్ద డ్రామాలాంటి ప్రొగ్రామ్ తీసుకొచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అంత వరకూ ఓకే.. దిశ యాప్ సరే.. మరి, ఆ రే-ప్ కేస్ నిందితుల జాడేది? ఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా.. ఆ బ్లేడ్ బ్యాచ్‌ను పట్టుకోలేకపోయారేం? ఇద్దరు నేరగాళ్ల సంగతే తేల్చలేని సర్కారు.. ఇక ప్రజలను సురక్షితంగా కాపాడుతుందనే నమ్మకం ఎలా కలుగుతుంది? పక్కరాష్ట్రం తెలంగాణలో ఇలాంటి దారుణాలు జరిగితే.. 24 గంటల్లోనే అక్కడి పోలీసులు పట్టుకుని.. తమదైన స్టైల్‌లో శిక్షిస్తుంటే.. సీఎం జగన్ అధికారిక నివాసం ఉన్న తాడేపల్లి ప్రాంతంలోనే ఇంతటి దారుణ ఘటన జరిగితే.. రెండు నెలలైనా నిందితులను అరెస్ట్ చేయలేకపోవడం జగన్ ప్రభుత్వ వైఫల్యం కాదా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటి ఆరోపణల మధ్య.. రెండు నెలల తర్వాత లేటెస్ట్‌గా తాడేపల్లి మండలం సీతానగరం గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి కనిపించింది. కీలక నిందితుడు ఒకడు పోలీసులకు చిక్కాడని తెలుస్తోంది. ఒంగోలులో నిందితుడిని అదుపులోకి తీసుకుని.. రహస్య ప్రాంతంలో నిందితుడిని విచారిస్తున్నట్టు సమాచారం.