టీ-20ప్రపంచకప్.. రెచ్చిపోయిన అలెన్,కాన్వే.. తోకముడిచిన ఆసీస్
posted on Oct 22, 2022 @ 4:42PM
క్రికెట్ పండితులు ఊహించినట్టుగానే న్యూజిలాండ్ కొత్త సూపర్‌స్టార్ ఫిన్ అలెన్ , డేవిడ్ కాన్వేలు శుక్ర వారం రెచ్చిపోయా రు. సూపర్ 12 విభాగంలో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆస్ట్రేలియాను 89 పరు గులు తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా కేవలం 17.1 ఓవర్లలో ఓవర్లలో 111 పరుగులు చేసింది. కాన్వే 8 పరుగుల దూరం లో సెంచరీ మిస్ అయినా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
ఎస్‌సిజీ గ్రౌండ్‌లో కివీస్ స్టార్ బ్యాటర్ అలెన్ కేవలం 16 బంతుల్లోనే 45 పరుగులు చేయడంలో ఆసీస్ బౌలర్లను బౌలింగ్ మర్చి పోయే లా చేశాడు. హాజల్ ఉడ్ ఓవర్లో అలెన్ వెనుదిరిగే వరకూ ఆసీస్ ఫీల్డర్లు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. టాస్ గెలిచి ఆసీస్ మొదటి బ్యాటింగ్ అవకాశం కివీస్‌కే ఇచ్చింది. కివీ ఓపెనర్ అలెన్ సంగతి తెలుసు గనుక అతను రెచ్చిపోతాడనే ఊహించాడు. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్లను అతని మీదకి వదిలేడు. సరిగ్గా టీ-20 మ్యాచ్‌లో ఎలాంటి పవర్ షాట్స్ కొట్టాలో బాగా అను భవం ఉన్న ప్లేయర్‌లా బాదేశాడు. 260.20 స్ట్రయిక్ రేట్‌తో ఆసీస్ బౌలర్లను దంచాడు. ఎట్టకేలకు హాజెల్ ఉడ్‌కి దొరకడంతో ఆసీస్ కాస్తంత ఊపిరిపీల్చు కుంది.
అతని స్థానంలో వచ్చిన డెవన్‌కాన్వే మరింత రెచ్చిపోయాడు. తన బ్యాటింగ్ పవర్ ప్రదర్శించడంలో అలెన్‌ను మరిపించాడు. ఎంతో దూకుడుగా ఆడుతూ జట్టుస్కోర్‌ను పరుగులెత్తించాడు. కెప్టెన్ విలి యమ్ సన్ 23 పరుగులకే వెనుదిరిగాడు. అతని తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ కూడా నిలకడగా ఆడక పో వడం కివీస్‌ను ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ 23 బంతుల్లో 23 పరుగులు చేయగా, ఫిలిప్స్ 10 బంతుల్లో 12 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన నీషామ్ ధాటిగా ఆడి 13 బంతుల్లో 26 పరుగుల చేయడంలో జట్టు స్కోర్‌ను పరుగులు పెట్టించాడు.
కానీ మరో వంక కాన్వే మంచి బ్యాటింగ్ పటిమ ప్రదర్శించి అలెన్ స్థాయిలో రెచ్చిపోయి అజేయంగా నిలి చాడు. అతను 8 పరుగుల తేడాలో సెంచరీ మిస్ అయ్యాడు. కేవలం 58 బంతుల్లో 92 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కాన్వే టీ20 ఫార్మాట్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. కేవలం 26వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్లోనే ఈ మైలురాయిని అధిగమించిన ఆటగాడిగా పాక్ ఆట గాడు బాబర్ ఆజమ్ సరసన నిలి చాడు. 26 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని అందు కున్న ఆజమ్ మొదటి స్థానంలో, కాన్వే రెండవ స్థానా ల్లో నిలిచారు. ఇక 27 ఇన్నింగ్స్‌లో 1000 పరుగుల మైలురాయిని అందు కున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడవ స్థానానికి పడిపోయాడు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డ్‌ని కాన్వే బద్ధలు కొట్టాడు.
201 పరుగుల లక్ష్యంతో దిగిన ఆసీస్ 50 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆసీస్‌కు రెండో ఓవర్ తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. ఐదు పరుగుల వద్ద ఓపెనర్ డేవిడ్ వార్న ర్(5).. సౌథీ బౌలిం గులో బౌల్డయ్యాడు. 30 పరుగుల వద్ద మరో ఓపెనర్ అయిన కెప్టెన్ అరోన్ ఫించ్ (13), మిచెల్ మార్ష్ (16), మార్కస్ స్టోయినిస్ (7), టిమ్ డేవిడ్ (11) పెవిలియన్ చేరారు. 68 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పో యిన ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిశాయి. ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా విజయా నికి 54 బంతుల్లో 127 బంతులు అవసరం కాగా, కివీస్ విజయానికి 5 వికెట్లు చాలు. ఆస్ట్రేలియా కోల్పోయిన ఐదు వికెట్లలో మూడు మిచెల్ శాంట్నర్‌కు దక్కగా, రెండు వికెట్లను టిమ్ సౌథీ పడగొట్టాడు. క్రమేపీ ఆసీస్ ఇన్నింగ్స్ 18 ఓవర్లో కుప్పకూలింది.