మహిళాకమిషన్ కు మెలుకువ వచ్చిన వేళ..!
posted on Oct 22, 2022 @ 3:04PM
జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మూడుపెళ్లిళ్ల గురించి చేసిన వ్యాఖ్యలపై మండిపడుతూ ఆయనకు ఏపీ మహిళాకమిషన్ నోటీసు జారీచేసింది. భరణం ఇస్తే ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చని ఆయన ఇటీవల ఒక సందర్భంలో అన్న మాట సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని, మహిళలను కించపరిచేలా ఉందని ఏమీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. చాలాకాలం నుంచీ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్నదాడులకు, అవమానాలకు స్పందంచని కమిషన్ హఠాత్తుగా మొద్దునిద్రనుంచీ మెలకువ వచ్చినట్టు స్పందించడంలో అర్ధం లేదని విశ్లేషకులు అంటున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇప్పటివరకూ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగు తూనే ఉందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సీతానగరం పుష్కరఘాట్ వద్ద మహిళ వేధింపులకు గురికావడం, సీతానగరం వద్ద మహిళ గ్యాంగ్ రేప్ అంశాన్ని అప్పట్లో టీడీపీ నాయకురాలు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ కూడా రాశారు. కానీ దాన్ని గురించి రాష్ట్ర కమిషన్ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. మరో సంఘటనలో ఆస్పత్రి కి వెళ్లి పలక రించేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకులను వైసీపీ వర్గాలు అడ్డుకోవడం ప్రజలు ఇంకా మర్చి పో లేదు. ఇటువంటివి చాలా ఉన్నాయి. కానీ వాటికి ఎన్నడూ ఇంత వెంటనే స్పందించని ఏపీ మహిళాకమిషన్ ఒక్కసారిగా మెగా స్టార్ పవన్ చేసిన ప్రకటనకు విరుచకు పడట మేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో అసలు మహిళల సంరక్షణా చట్టాలు సరిగా అమలు అవుతున్నాయా అన్న ప్రశ్న విద్యావంతులు, మేధావులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కేవలం పథకా లు ఆరంభించడం పార్టీ వారితో భజనలు చేయిం చు కోవడం తప్ప వాస్తవానికి మహిళల సంరక్షణ విషయంలో సీరియస్‌గా ఏ ఒక్క ప్రయోజనకర పథక అమలూ జరగడం లేదన్నది విపక్షాల మాట.
అక్కచెల్లెళ్ళకు ఈ అన్న మీ జగనన్న నిత్యం తోడు ఉంటాడని ప్రతీ బహిరంగ సభలో ప్రమాణం చేస్తున్న ట్టు ప్రకటనలు గుప్పించడమే సీఎం జగన్ చేసింది. ఆ తర్వాత ఆ హామీలు, మాటలు మర్చిపోవడమే జరిగింది. అందుకే రాష్ట్రంలో మహిళల రక్షణ కరవయిందని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. కేవలం తమ ను తాము విపక్షాల ఆగ్రహం, విమర్శల నుంచి తప్పించుకోవడానికి ఇపుడు మహిళా కమిషన్ పవన్ ప్రక టన అర్ధరహితమని ఆయనకు నోటీసు జారీ చేయడం జరిగిందే కాని, నిజంగా అలాంటి సంఘట నలు, అలాంటివారి పై చర్యలు తీసుకోవడం ఎన్నడూ చేపట్టలేదు.
2019 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో దిశ ఘటన తర్వాత అదే నెలలో జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చట్టసవరణ చేసి 'దిశ చట్టం' తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం- 2019 తో పాటు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్ట్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనిస్ట్ విమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్- 2019 కూడా ఆమోదించి అమలులోకి తెస్తున్నట్టు ప్రక టించింది. ఏపీలో శాసన ప్రక్రియ పూర్తి చేసుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ చట్టంపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. చట్టాల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమయిందనడానికి రాష్ట్రంలో మహిళ లపై పెరుగుతున్న దాడులే పెద్ద సాక్ష్యం. కనుక కేవలం ప్రకటనలు, విపక్షాలు తిడతాయన్న భయంతో నోటీసులు జారీ చేయడాలు, గట్టిగా విమర్శించడాలు ఇకనైనా మానుకోవాలి. చట్టాలు పటిష్టంగా అమలు చేస్తు, ప్రజాసంరక్షణా, మహిళా సంరక్షణా బాద్యతను సక్రమంగా చేపడుతున్నపుడే విపక్షాలను ప్రశ్నిం చే హక్కు అర్హత కలుగుతాయన్నది వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలి.