కరన్ ధాటికి దాసోహమన్న ఆఫ్ఘన్ ..ఇంగ్లండ్ విజయం
posted on Oct 22, 2022 @ 10:24PM
టి-20 ప్రపంచకప్ సూపర్ 12 విభాగంలో శనివారం జరిగిన రెండోమ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించ డంలో సామ్‌కరన్ కీలక పాత్ర వహించాడు. పెర్త్‌లో కరన్ బౌలర్ గా మంచి ఫీల్డర్‌గానూ జట్టు విజయానికి ఎంతో సహకరించ డంతో ఆఫ్ఘనిస్తాన్ 19.4 ఓవర్లలో 112 పరుగులకు వెనుదిరిగింది. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కరన్ 5 వికెట్లు తీశాడు. గతేడాది ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ సెమీఫైనల్స్‌లో వెను దిరిగిన సంగతి తెలిసిందే. కానీ ఈ పర్యాయం అద్బుత ఆట తీరు తో టైటిల్ గెలుచుకోవ డానికి మంచి ఊపుమీద ఉన్నట్టు కన పడింది. ఇంగ్లండ్ 18.1 ఓవర్ల లోనే లక్ష్యం పూర్తి చేసి విజేతగా నిలిచింది. జోస్ బట్లర్ టాస్ గెలిచి ఆఫ్ఘనిస్తాన్‌కు ముందుగా బ్యాట్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఆరంభం నుంచే ఆఫ్ఘన్ బ్యాటర్లు ఇంగ్లండ్ పేస్ అటాక్‌కి ఇబ్బం ది పడ్డారు. పరుగులు రాబట్టుకోవడంలో స్వేచ్ఛగా ఆడలేకపోయారు. ఫలితంగా 112 పరుగులే చేయగలిగింది.
ఇంగ్లండ్ పేసర్ మార్క్ఉడ్ మూడవ ఓవర్లోనే గుర్జాబ్ వికెట్ తీసి ఆశ్చర్యపరిచాడు. అంతకుముందు ఓవర్లోనే గుర్జాబ్ భారీ సిక్స్ కొట్టి అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. బెన్‌స్టోక్స్ అద్బుతంగా బౌలింగ్ చేసి 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అంతేగాక ఒక అద్భుత రన్నింగ్ క్యాచ్ పట్టి ఫీల్డింగ్ సత్తాను ప్రకటించాడు. జట్టు స్కోర్‌ను పెంచడానికి జద్రాన్ ఎంతో ప్రయత్నించాడు. అతను చక్కగా ఇన్నింగ్స్ నిలబెట్టి స్కోర్ చేస్తుండగానే కరన్‌కి దొరికిపోయాడు. అతను 32 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఈ మ్యాచ్‌లో చూసి తీరాలి. ఇరు జట్లు అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శించారు. మిడ్‌వికెట్‌లో అదిల్ రషీద్ క్యాచ్ తీసుకున్న తీరు మహాద్బుతం, చూసి తీరాలి. అలాగే ఆఫ్ఘన్ కెప్టెన్ మహమ్మద్ నబీ కేవలం 3 పరుగులకే వెనుదిరగడానికి బట్లర్ అద్భుత క్యాచ్ కారణంగా చెప్పాలి. అలా ఊహించని విధంగా పేకముక్కల్లా వికెట్లు పడుతూండడంతో 91 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఆఫ్ఘన్ బోర్లాపడింది. తర్వాత కర్రన్ ఒకే ఓవర్లో వరుసగా రెండు వికెట్లు తీసి వారి ఇన్నింగ్స్‌ను మరింత దెబ్బతీశాడు. కుర్రన్‌కు హ్యాట్రిక్ వస్తుందని అంతా ఎదు రు చూశారు. కానీ అతనికి ఆ అదృష్టం దక్కలేదు. మూడో వికెట్ ఆ తర్వాత బంతికి దొరికింది.
113 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ పెద్దగా కష్టపడకుండానే గెలిచిందనాలి. ఓపెనర్లు బట్లర్(18), అలెక్స్ హాల్స్ (19) వేగంగా పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ఫీల్డింగ్ లోపాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఊహించిన స్థాయిలో వారి ఫీల్డింగ్ లేకపోవడం కూడా ఇంగ్లండ్ విజయం సులభం అయిందనాలి. క్యాచ్‌లూ వదిలేయడం హేల్స్ బ్యాటింగ్‌లో బయటపడింది. అయినా ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోవడం ఆశ్చర్యపరిచింది. లివింగ్‌స్టన్, మోయిన్ ఆలీ నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.