తలసాని మాట్లాడితే.. టీడీపీ వెళ్లిపోతుందట
posted on Sep 14, 2015 @ 11:30AM
టీడీపీ పార్టీ నుండి గెలుపొంది ఆ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రిగా చెలామణి అవుతున్న తలసాని యాదవ్ పై ఇప్పటికే టీ టీడీపీ నేతలు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీచేశారు. ఆయనను బర్తరఫ్ చేయించాలని.. రాజీనామాచేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశారు.. గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు టీడీపీ నేతలు మరోసారి తలసానిపై స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.
ఈనెలలో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలలో ఏయే పాయింట్ల మీద మట్లాడాలో టీ టీడీపీ నేతలు కలిసి రైతుల ఆత్మహత్యల దగ్గర నుండి మొత్తం 20 పాయింట్లతో కలిసి ఒక జాబితాను రాసుకున్నారట. అందులో తలసాని అంశం కూడా చేర్చారట. ఈసభలో మాత్రం తలసానిని బర్తరఫ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేయాలని.. ఒకవేళ తలసాని కనుక తన శాఖకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడినట్టయితే సభ నుండి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారంట.
అయితే టీ టీడీపీ నేతల ప్లాన్ బాగానే ఉన్నా అధికార ప్రభుత్వం మాత్రం వీరి డిమాండ్ కు ఒప్పుకుంటుందా? టీడీపీ నేతలు సభ నుండి బయటకు వెళ్లినంత మాత్రానా స్పీకర్ తలసానికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఉంటారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి తలసాని పై టీడీపీ వేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.