రఘువీరా పై రాళ్లు ఇసుకతో దాడి
posted on Sep 14, 2015 @ 10:58AM
రైతులకు మద్దతు పలికేందుకు కృష్ణాజిల్లా వెళ్లిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నేపథ్యంలోగానూ మచిలీపట్న పోర్టుకు కూడా భూసేకరణ ప్రకటించింది. అయితే దీనికి వ్యతిరేకంగా బందరు మండలం, కోన గ్రామ సెంటర్ లో రైతులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా రైతులకు మద్దతు పలికేందుకు వెళ్లిన ఆయన అక్కడ మాట్లాడుతుండగా కొంతమంది ఆయనపై దాడి చేశారు. ఇసుక, కంకర రాళ్లు విసురుతూ రఘువీరాపై గొడవకు దిగారు. ఒకపక్క పోలీసులు వారిని అదుపు చేసే పయత్నం చేసినా వారిమీద కూడా కొందరు యువకులు తిరగబడ్డారు. దీంతో చేసేది లేక రఘువీరా.. ఆయనతో పాటు వెళ్లిన కాంగ్రెస్ నేతలు వెను తిరిగి రావాల్సి వచ్చింది.
అయితే ఉరిము ఉరిమి మంగల మీద పడినట్టు... ఈ సంఘటనకు కారణం టీడీపీయే అని రఘువీరా రెడ్డి అంటున్నారు. సభ సజావుగా జరగకూడదనే ఉద్దేశ్యంతోనే గ్రామానికి చెందిన యువకులను ఉసి కొల్పి మాపై దాడిచేయించారని ఆరోపించారు. ఏడాదికి రెండు పంటలు పండే భూములను రైతల దగ్గర నుండి ఎలా తీసుకుంటారని అన్నారు. ఒకవేళ రైతుల దగ్గర నుండి భూములు తీసుకున్న వారికి మార్కెట్ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి అంత సీన్ లేదు కాబట్టి భూసేకరణ జరిగే ప్రసక్తి లేదు.. రైతులంతా ధైర్యంగా ఉండాలని అన్నారు