స్వామిరారా.. కరోనాను కాలితో నలిపేయరా...
posted on Jun 9, 2021 @ 3:03PM
నిత్యానంద. ఆయన గురించి తెలీని వారు ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఫుల్ ఫాలోయింగ్. రాసలీలల ఎపిసోడ్‌తో ఆ తర్వాత ఫుల్ డ్యామేజ్. ఆయనపై లై*గిక ఆరోపణల కేసులతో దేశం విడిచి పారిపోయారు. ఈక్వెడార్ పక్కన ఓ చిన్నదీవి కొనుక్కొని.. సొంత దేశంగా ప్రకటించుకున్నారు. 'కైలాస' పేరుతో అప్పటి నుంచీ తెగ ఓవరాక్షన్ చేస్తున్నారు. సొంత కరెన్సీ, సొంత బ్యాంకు, సొంత పాస్‌పోర్టుతో బిల్డప్ ఇస్తున్నారు. తన కైలాస
కట్ చేస్తే, లేటెస్ట్‌గా నిత్యానంద ఓ అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆ స్పీచ్ పరమార్థం ఏంటంటే.. అవతార స్వరూపుడినైన తాను ఇండియాలో అడుగుపెడితే.. కరోనా ఖతం అవుతుందని సెలవిచ్చారు.
ఓ భక్తుడు అడిగిన ప్రశ్నకు ఆయనలా సెలవిచ్చారు. ఆయన మాటలను బట్టి స్వాములోరు మళ్లీ భారత్‌లో అడుగుపెట్టే ఉద్దేశ్యం ఉన్నట్టు కనబడుతోంది. అదే జరిగితే.. ఇలా ఆయన పాదం మోపగానే.. అలా కరోనా ఖతం అవుతుందో లేదోగాని.. ఆయన కాళ్లతో పాటు చేతులకూ సంకెళ్లు వేసి.. చెరసాలలో తోసేందుకు పోలీసులు మాత్రం రెడీగా ఉన్నారు.
తన 'కైలాస' దేశం నుంచి ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు, శిష్యులతో తరుచూ సంభాషిస్తున్నారు నిత్యానందస్వామి. ఆన్‌లైన్లోనే ఆశీర్వచనాలు ఇస్తున్నారు. అంతేకాదు, కరోనా కారణంతో ఇటీవల భారత్ నుంచి వచ్చే భక్తులకు తన దేశంలోని నో ఎంట్రీ అంటూ రాకపోకలను నిషేధించారు స్వామి వారు. యూరప్ దేశాల నుంచీ 'కైలాస' దేశానికి ఎవరూ రావొద్దంటూ ఆయా దేశాల దౌత్య కార్యాలయాలకు లేఖలు కూడా రాశారు. తాజాగా, ఇండియాలో కరోనా పోవాలంటే.. తన మహిమాన్విత పాదం మోపాల్సిందేనంటూ సెలవివ్వడం బహు తమాషాగా ఉంది. స్వామిరారా.. నీ సంగతి తేలుస్తాంరారా.. అంటూ కర్ణాటక పోలీసులు నిత్యానందను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. మరి వస్తారా..? సాములోరు వస్తారా? అంత ధైర్యం, సాహసం చేస్తారా?