మూన్ పై ప్లాట్ కొనుగోలు చేసిన సుశాంత్ కి ఆర్థిక ఇబ్బందులా?
posted on Jun 15, 2020 @ 1:48PM
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి అందరిని కదలించివేస్తోంది. సుశాంత్ ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సుశాంత్ మృతిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మృతి వెనుక కుట్ర ఉందని, ఎవరో హత్య చేసి ఆత్మహత్య గా చిత్రికరీస్తున్నారేమోనని కొందరు అనుమానపడుతున్నారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యకు ఇదే కారణమంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. సుశాంత్ తన గర్ల్ ఫ్రెండ్ కి అవకాశం ఇవ్వాలంటూ చేజేతులా పలు సినిమాలు వదులుకున్నాడని, తన ప్రవర్తన కారణంగా తన దగ్గర పనిచేసే వాళ్ళని దూరం చేసుకున్నాడని, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు తగ్గిపోయి, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో.. ఒంటరిగా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకున్నాడని అంటున్నారు. అయితే, సుశాంత ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణమనే ప్రచారాన్ని పలువురు ఖండిస్తున్నారు.
సుశాంత్ ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు తీసుకుంటాడు. అడ్వర్టైజ్‌మెంట్లకు రూ.కోటి వరకు తీసుకుంటాడు. సినిమాలు, అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ సహా పలు చోట్లు పెట్టుబడిగా కూడా పెట్టాడు. సుశాంత్ లైఫ్ స్టైల్ కూడా రిచ్ గానే ఉంటుంది. సుశాంత్ దగ్గర చాలా కార్లు, బైకులు ఉన్నాయి. ల్యాండ్ రోవర్, మాసెరటి క్వార్టర్‌పోర్ట్, బీఎండబ్ల్యూ లాంటి కార్లతో పాటు.. మంచి స్పోర్ట్స్ బైక్ లు ఆయన సొంతం. బాలీవుడ్‌కు రాకముందు చాలా టీవీ సిరియల్స్ లలో నటించాడు. టీవీ షోస్ చేశాడు. ఇలా సుశాంత్ సంపదానికి ఎప్పుడూ డోకా లేదు. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమాలు, అడ్వర్టైజ్‌మెంట్ల ద్వారా బాగానే సంపాదించాడు. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్లు ఉండవచ్చని అంచనా. అంతే కాదు.. అంతరిక్షం అంటే సుశాంత్ కి ఎంతో ఇష్టం. అందుకేనేమో ఏకంగా.. చంద్రుడిపైనే ప్లాట్ కొనుగోలు చేశాడు. ఆలా మూన్‌పై ప్లాట్ కొనుగోలు చేసిన తొలి బాలీవుడ్ యాక్టర్‌గా సుశాంత్ నిలిచారు. సీ ఆఫ్ మాస్కోవీలో ఈయన ప్లాట్ ఉంది. 14ఎల్ఎక్స్00 అనే పవర్‌ఫుల్ టెలీస్కోప్‌తో ప్లాట్‌ను చూసి.. ఇంటర్నేషనల్ లూనర్ ల్యాండ్స్ రిజిస్ట్రీ ద్వారా ఈ ల్యాండ్ సొంతం చేసుకున్నాడు సుశాంత్. అలాంటి వ్యక్తి మృతికి ఆర్థిక ఇబ్బందులు కారణం అవుతాయా? అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.