రీల్ హీరోలకు... రియల్ హీరోలు కనిపించటం లేదా?
posted on Sep 30, 2016 @ 3:34PM
మసూద్ అజర్... వీడెవడో ఇండియన్స్ అందరికీ తెలుసు! వాజ్ పేయ్ ప్రభుత్వం వున్నప్పుడు మన విమానం హైజాక్ అయింది. వంద మందికి పైగా మరణిస్తారనే ఆలోచనతో అప్పటి ఇండియన్ గవర్నమెంట్ ఈ కుక్కని మన జైల్లోంచి వదిలింది. వెంటనే వీడు తోకాడించుకుంటూ పోయి పాకిస్తాన్ లో నక్కాడు. ఇక అక్కడ్నుంచీ అప్పుడప్పుడూ మొరుగుతూనే వుంటాడు!
తాజాగా మసూద్ యురీ ఉగ్ర ఘాతుకం తరువాత మొరిగాడు. ఏమన్నాడంటే... బారత్ పాకిస్తాన్ లోకి చొరబడి దాడి చేయటం కాని పని అన్నాడు. అలా బాలీవుడ్ సినిమాల్లో మన హీరోలు మాత్రమే చే్స్తారట! ఇండియన్ ఆర్మీకి అంతా సీన్ లేదన్నాడు! కాని, మసూద్ నోటికి వచ్చినట్టు మొరిగిన వారం తిరగకుండానే మోదీ చేతిలో పాక్ ఉగ్రవాదులకి మూడింది! మసూద్ సినిమా హీరోలే వచ్చి దాడి చేసి పోతారన్న మాటని అబద్ధం చేస్తూ మన రియల్ ఆర్మీ హీరోస్ అక్కడికి వెళ్లి సినిమా చూపించారు! కుక్కల్ని కుక్క చావు చచ్చేలా చేసి... సింహాల్లా తిరిగొచ్చారు!
పాక్ మీద ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేసింది బాగానే వుంది... బాలీవుడ్ హీరోల్లాగే మన నిజమైన హీరోలు చెలరేగిపోయారు. ఇంకా బావుంది. కాని, ఇదంతా జరుగుతుంటే మన మేకప్ హీరోలు ఏం చేస్తున్నారు? బాలీవుడ్లోళ్లు కాస్త నయం! అక్షయ్ కుమార్ లాంటి చాలా మంది ట్విట్టర్ లో ఇండియన్ ఆర్మీకి జైకొట్టారు! రవీనా టాండన్ లాంటి మాజీ హీరోయిన్ గర్వంగా భారత సైన్యాన్ని మెచ్చుకుంది! కాని, తెలుగు హీరోలు, హీరోయిన్స్ ఏమైపోయారు? అసలు వున్నారా? చచ్చారా? ఇలాంటి డౌట్ వచ్చేలా నిశ్శబ్దం!
ఆడియో రిలీజ్ లు అయితే ''మేం ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాం. లుంగీలు కట్టుకుని రెండు కాళ్లు లేపి గాల్లోకి ఎగిరి అద్భుతమైన ఫీట్స్ చేశాం'' ఇలాంటి సొల్లు చెబుతారు! హీరోయిన్స్ అయితే వచ్చీరాని తెలుగుతో... ఎందుకు వచ్చాం రా దేవుడా అన్నట్టు '' హీరో పోటుగాడు, దర్శకుడు కేటుగాడు, నిర్మాత బీటుగాడు'' అంటూ పొగిడేసి వెళ్లిపోతారు. సినిమా రిలీజ్ కి వారం ముందు, వారం తరువాత వద్దన్నా ఇంటర్వ్యూలు ఇచ్చి ఇరిటేట్ చేస్తారు. కాని, అదేంటో దేశం యుద్ధం చేసే విషమ క్షణంలో వుంటే ఎవ్వరూ కనిపించి చావటం లేదు! కనీసం ట్విట్టర్ లో కూడా నాలుగు ముక్కలు రాసినోడు లేడు! వారం వారం సినిమాలు రీలీజ్ అయితే మాత్రం ఒకడి సినిమాను ఒకడు తెగ మెచ్చుకుంటాడు. అచ్చం... బార్బర్ షాపులో పని చేసేవాళ్లు ఒకడి గడ్డం ఒకడు గీసుకున్నట్టు!
అసలు మన సినిమా వాళ్లకు, ముఖ్యంగా లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్న బాబులకి సామాజిక బాధ్యత వుందా? పది రోజుల కింద యూరీ దారుణం జరిగింది. ఇంచుమించూ ఇరవై మంది జవాన్లు బలైపోయారు! అయినా కూడా ... సినిమాల్లో అద్దెకు తెచ్చిన ఆర్మీ డ్రస్సు వేసుకుంటేనే గొంతు చించుకుని అరిచి అరిచి డైలాగ్లు చెప్పే మన హీరోలు ఒక్క మాట మాట్లాడలేదు! ఇక ఇప్పుడు పాక్ పై మన వాళ్లు విరుచుకుపడి ప్రతీకారం తీర్చుకుంటే కూడా... ఎక్కడ్నుంచీ చప్పుడు లేదు! తమ లాగా కాక డూపుల సాయం లేకుండా రియల్ ఫైటింగ్ చేసిన రియల్ హీరోల గురించి మన రంగు బాబులు మాట్లాడరా? దేశం, దేశ భద్రత, జవాన్లు, వాళ్ల ప్రాణాలు, వాళ్లు సాధించే విజయాలు వీళ్లకి పట్టవా?
పాకిస్తాన్ పై భారత్ దాడి తరువాత ఫేస్బుక్, ట్విట్టర్లు ఇండియన్స్ చేస్తున్న పోస్టులతో భగ్గున మండిపోతున్నాయి. కాని, గణపతి తలని శివుడు ఎందుకు నరికాడని అడిగే మన మేధావి దర్శకులు మాత్రం కిక్కురుమనటం లేదు! ప్రత్యేక హోదా కోసం పనిగట్టుకుని పాటలు పాడిన వారు ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు! అయినా ఒక దర్శకుడు, ఒక హీరో, ఒక హీరోయిన్ అని కాదు... టాలీవుడ్ లోని ఏ ఒక్కరూ పాకిస్తాన్ గురించి, ఉగ్రవాదుల గురించి ఏమీ మాట్లాడకపోవటం ఎలా అర్థం చేసుకోవాలి? బహుశా, వీళ్లకు థమ్సప్ తాగితే తుఫాన్ వస్తుంది, నవరతన్ రాసుకుంటే సమస్యలు తీరిపోతాయి అని చెప్పినందుకు డబ్బులు ఇస్తారు కదా... అలా ముట్టజెప్పాలేమో! బట్టల దుకాణాల రిబ్బన్ లు కట్ చేసినందుకు బరువైన చెక్ లు ఇస్తుంటారు కదా... అలా అందిస్తే... అప్పుడు దేశం గురించి, దేశ సమస్యలు, సైనికుల గురించి మాట్లాతారేమో! థూ దీనమ్మా జీవితం!
హీరోలు, సినిమా వాళ్లు మాట్లాడకుంటే ఏం కాదు. కాని, మీ ఒక్క మాటతో రక్తాలు దానం చేసేవాళ్లు, రక్తాలు కారేలా కొట్టుకు చచ్చేవాళ్లు అవతల వున్నారు. ఆ అభిమానులకి దేశంపై ప్రేమ కలగటానికి మీకు ఎంత ఒళ్లు బద్ధకమైనా దేశం గురించి మాట్లాడాలి. ట్వీట్ లు చేయాలి. భారత్ మాతాకీ జై అనాలి! లేకపోతే, భారతదేశం అంటే మీకు కేవలం బాక్సాఫీస్ మాత్రమే అని ఫీలింగ్ వుందని మేం అర్థం చేసుకోవాల్సి వస్తుంది.... టేక్ కేర్!