ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్ పెట్టి బిల్డింగ్ మీద నుంచి దూకింది
posted on May 9, 2014 @ 5:02PM
మలేసియాలోని కోటా కినాబాలు అనే టౌన్‌కి చెందిన హర్సినా చీ అనే యువతి ఎంతోకాలంగా ఒక యువకుడితో ప్రేమలో వుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె లవ్‌స్టోరీలో అనుకోని మలుపులు వచ్చాయి. ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లో కూరుకుపోయింది. గత కొన్ని రోజులుగా ఆమె తన ఫేస్‌బుక్ వాల్ మీద నిర్వేదంతో కూడిన పోస్టింగ్స్ చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్‌ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా పోస్ట్ చేస్తోంది. దీనిని ఆమె ఫ్రెండ్స్ గానీ, ఆమె ప్రియుడు కానీ పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. సడెన్‌గా నిన్న ఆమె ఒక సూసైడ్ నోట్‌ని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. ‘‘బిల్డింగ్ మీద నుంచి దూకడం ఒక పిచ్చిపని అని నాకు తెలుసు.. కానీ ఇప్పుడు నాముందు అది తప్ప మరో మార్గం లేదు. ఇది నీకోసమే రాస్తున్నాను. నేను ఎంత పిచ్చిదాన్నో నీకు తెలిసొచ్చేలా చేస్తాను. నీకు నా థాంక్స్. నేను నా కళ్ళని శాశ్వతంగా మూసేస్తున్నాను’’ అని పోస్ట్ చేసి వెంటనే బిల్డింగ్ మీద నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంది.