స్టైల్ గా గంజా సిగరెట్ తాగుతూ పట్టుబడిన విద్యార్థులు!
posted on Aug 26, 2025 @ 10:38PM
తమ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపా దించాలని ప్రతి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారిని చదివిస్తూ ఉంటారు. కానీ మరోవైపు విద్యా ర్థులు తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియకుండా రహస్యంగా చెడు అలవాట్లకు బానిసై బంగారు భవిష్యత్తు ను పాడు చేసుకుంటున్నారు.
యువత డ్రగ్స్ అనే మహమ్మారి మాయలో పడి దాన్ని సేవించడమే కాకుండా సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించడానికి వాటి విక్రయించి, చివరికి జైలు పాలవుతున్నారు. ఓ పెద్ద యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు డ్రగ్స్ కు అలవాటు పడిన ఘటన ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నగరంలో వెలుగు లోకి వచ్చింది.
బాచుపల్లి మహేంద్ర యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. 50 మంది విద్యార్థులు గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సేవిస్తున్నట్లు ఈగిల్ టీం గుర్తించింది. ఈ కేసులో కీలకపాత్ర పోషించిన నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి కిలోకిపైగా గంజాయి, 47 గ్రాముల ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ విద్యార్థులు.. పోలీసుల కంట పడకుండా గంజాయిని కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారు. మణిపూర్‌కు చెందిన విద్యార్థి నోవెల్లను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విద్యార్థి ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా గంజాయి తెప్పించుకుంటున్నాడు. ఆ గంజాయిని నోవెల్ల ఒక్కో గంజాయి సిగరె ట్‌ను రూ.2500కు మిగతా విద్యార్థు లకు అమ్ముతు న్నాడు.
ఈ గంజాయి కేసులో నోవెల్ల,అంబటి గణేష్, శివకుమార్, జావెద్ అనే నలుగురు విద్యార్థులు కీలక సూత్రధారులుగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించి, ఆ నలుగురిని అరెస్టు చేశారు. గంజాయి, ఓజీ కుష్ కలిపి సిగరెట్లు తయారు చేసి అమ్మకాలు జోరుగా కొనసాగి స్తున్నారు.అయితే ఢిల్లీకి చెందిన అరవింద్ శర్మ అనే వ్యక్తి అనిల్‌తో కలిసి గంజాయి బిజినెస్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.నోవెల్ల అనే విద్యార్థి ఢిల్లీకి చెందిన ముఠాతో గంజాయి తెప్పించుకుం టున్నాడు.కేవలం విద్యార్థులను మాత్రమే టార్గెట్ గా చేసుకొని గంజాయి విక్రయాలు చేస్తున్నాడు.