కావలి మాజీ ఎమ్మెల్యే ఇంజినీరింగ్ కాలేజీలో మద్యం లోడు!
posted on Aug 26, 2025 @ 10:28PM
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఆర్ కాలేజీలో మూడు లోడ్ల మద్యం ఉందంటూ కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను మూటగట్టకున్న ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎమ్మెల్యేగా తనకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తన హత్యకు కుట్రపన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గత 15 నెలలుగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెడుతున్న తనపై కక్షగట్టి వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
కావలి ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి తన అవినీతి, అక్రమాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారని విమర్శించారు. రాజకీయాలలోకి రాకముందు నుంచే తనకు క్వారీ వ్యాపారం ఉందన్న కావ్యకృష్ణారెడ్డి. కావలి నియోజకవర్గానికి సంబంధం లేని ఉదయగిరిలొ ఉన్న క్వారీ మీద అధికారులతో దాడి చేయించారని, న్యాయస్థానం వైసీపీ హయాంలోనే తనకు క్లియరెన్స్ ఇచ్చిందనీ పేర్కొన్నారు.
ప్రజలు చిత్కరించుకుంటుంటే తట్టుకోలేని ప్రతాప్ కుమార్ రెడ్డి కావలిలో శాంతిభద్రతల విఘాతం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కావలిలో రౌడీ షీటర్లు సంస్కృతిని పెంచి పోషించిందే ప్రతాప్ కుమార్ రెడ్డి అని పేర్కొన్న కావ్యకృష్ణారెడ్డి డోన్ కెమేరాలతో తన కదలికలను పసిగట్టే ప్రయత్నం చేశారన్నారు.
ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న ప్రతాప్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి కాకణి మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. హత్యారాజకీయాలలో ఆరితేరిన కాకణి, ప్రతాప్ రెడ్డిలు ఇద్దరు కల్తీ మద్యం ముద్దాయిలు, దొంగలు అని విమర్శించారు. తనపై ఒక్కటంటే ఒక్క కేసు లేదనీ, అదే కాకాణిమీదైతే 14 కేసులు కాకణి, ప్రతాప్ కుమార్ రెడ్డి ఎనిమిది కేసులలో ముద్దాయిలుగా ఉన్నారని కావ్య విమర్శించారు.