మేధోమథనానికి మెదడు కావాలిగా..!
posted on Sep 15, 2012 @ 12:11PM
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మేధోమధనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్టీలోని క్రింది స్థాయి నేతలకు అభిప్రాయాలతోపాటు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు 23న లలిత కళాతోరణంలో ఒకరోజుపాటు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి సదస్సు అని అనుకున్నా పార్టీలో అంతర్గతంగా చర్చ జరగాల్సి వుందన్నడిమాండ్ల నేపథ్యంలో మేథోమథనానికి శ్రీకారం చుట్టిందని పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ఇది అభినందించదగ్గ విషయమే. అయితే సగటు మనిషికి, సామాన్య అభిమానికి ఒకటే అనుమానం. ఇక్కడ పార్టీకి మేధావులు మేథోమధనం చేయాలంటే మెదడుకు పనిచెప్పాలి. దాన్నేమో.. ఆ పార్టీవారంతా కేంద్రంలోని అధిష్టానం వద్ద ఉంచుతారు.! మరి ఇక్కడ మేథోమధనం చేసి ఏం ప్రయోజనం? టిఫిన్ల ఖర్చు తప్ప!? ఇది సామాన్యుడి ప్రశ్న...! దీనికి జవాబు ఎవరివ్వగలరు మరి!