వరదల్లో స్టాలిన్..ప్యాలెస్ లో జగన్! ఏపీ ప్రజల ఖర్మ ఇంతేనా..?
posted on Nov 12, 2021 @ 2:46PM
వాయుగుండం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వర్ష బీభత్సానికి తమిళనాడు అతలాకుతలమవుతోంది. రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో వరద విలయం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లోనూ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షాల నేపథ్యంలో తమిళనాడు సర్కార్ అద్భుతంగా స్పందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికగా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలాంటి చర్యలు కనిపించడం లేదు. వరదలతో అల్లాడిపోతున్న జనాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు.
తమిళనాడులో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ గత వారం రోజుల నుంచి ఫీల్డ్‌లోనే ఉన్నారు. వర్షాల దెబ్బకు అతలాకుతలమైపోతున్న జనాన్ని ప్రత్యక్షంగా ఆదుకోవడానికి ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. వరద బాధితులకు అందుకున్న ఆహారం గురించి … సౌకర్యాల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తానే స్వయంగా శిబిరాల దగ్గరకు వెళ్లి పంపిణి చేస్తున్నారు. స్థాలిన్ తీరుపై చెెన్నైలోని తెలుగువాళ్లు కూడా పోస్టులు పెట్టి అభినందిస్తున్నారు.
అయితే తమిళనాడు తరహాలోనే ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరులో పరిస్థితి దారుణంగా ఉంది. తిరుపతి వరదలో చిక్కుకుపోయింది. వందలాదీ కాలనీలు నీట ముునిగాయి. ఇంతటి దారుణ పరిస్థితులు ఉన్నా.. ఏపీ ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. వరద బాధితులను ఆదుకోవడంలో అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ అమరావతి క్యాంపు కార్యాలయంలో కూర్చుని సమీక్షలు చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. బాధితులకు ఏం కావాంటే అది ఇవ్వాలని ఆర్డర్స్ పాస్ చేసేస్తున్నారు. కాని సీఎం చెప్పినా ఫీల్డ్ లో అందించేవారే కనిపించడం లేదు.
వర్షాలు, వరదల నేపథ్యంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ను పోల్చుతూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. వరద సహాయ చర్యల్లో స్ఠాలిన్ పని తీరు ఎలా ఉంది, ఏపీ సీఎం జగన్ ఏం చేస్తున్నారన్న దానిపై చాలా మంది పోస్టులు పెడుతున్నారు. వరద్లలో తిరుగుతున్న స్టాలిన్ ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. రియల్ హీరో జనాల్లో ఉంటే.. జగన్ రెడ్డి మాత్రం ఆఫీసులో ఫోజులు కొడుతున్నారంటా కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వదిలి జనంలోకి రావాలి జగన్ అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. స్ఠాలిన్ లాంటి లీడర్ ముఖ్యమంత్రిగా ఉండటం తమిళనాడు ప్రజల అధృష్టం.. జగన్ రెడ్డి ఉండటం ఏపీ ప్రజల ఖర్మ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ నిద్రలేవాలని, స్టాలిన్ ను చూసైనా జనంలోకి రావాలని మరికొందరు సూచిస్తున్నారు.