RRR+R.. బీజేపీ ఎమ్మెల్యేలకి జతకలిసే నాలుగో 'R' ఎవరో తెలుసా?
posted on Nov 12, 2021 @ 2:05PM
తెలంగాణ అసెంబ్లీలో RRR. బీజేపీ నుంచి ముగ్గురు మొనగాళ్లు. రాజాసింగ్, రఘునందన్‌రావు, రాజేందర్. RRR కాంబినేషన్‌తో ఇక సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో చెడుగుడే అంటున్నారు. ఇక కాస్కో కేసీఆర్ అంటూ RRR పేరుతో కమలనాథులు ముఖ్యమంత్రిని పెద్ద ఎత్తున కవ్విస్తున్నారు. అసెంబ్లీ సెషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. సీఎంకు RRR తఢాకా ఎప్పుడెప్పుడు చూపిద్దామా అంటూ బీజేపీ సమరోత్సాహంతో ఉంది.
ఇంకా RRR కాంబినేషన్ అసెంబ్లీలో అడుగుపెట్టక ముందే.. అప్పుడే RRR+R.. మొత్తం నాలుగు-Rల గురించి చర్చ స్టార్ట్ అయిపోయింది. ముగ్గురు Rలతోనే ఆగిపోదు.. త్వరలోనే నలుగురు Rలు అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. మరి RRRకి జతకలిసే ఆ నాలుగో R ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన ఎవరంటే....
నల్గొండ జిల్లాకు చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డినే అంటున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కొంతకాలంగా కాంగ్రెస్‌పై గుర్రుగా ఉంటున్నారు. అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రేవంత్‌రెడ్డికి రెబెల్‌గా మారారు. పీసీసీ చీఫ్ రాలేదనే అక్కసో, మరే కారణమో తెలీదు కానీ.. వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి కంట్లో నలుసుగా మారారు. అయితే, తాను కాంగ్రెస్‌ను వీడేది లేదంటూ చాలా గట్టిగా చెబుతున్నారు వెంకట్‌రెడ్డి. అన్న కాంగ్రెస్‌లోనే ఉంటానంటున్నా.. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌ను వీడాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. సరైన సమయం కోసం మాత్రమే ఇన్నాళ్లూ ఆగారంటున్నారు.
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి సైతం తన సన్నిహితుల దగ్గర ఆ విషయం పదే పదే చెబుతున్నారట. అయితే, ఎందుకోగానీ ఆయన బీజేపీ కండువా కప్పుకోవడం ఆలస్యం అవుతోంది. మొదట్లో తన అన్న వెంకట్‌రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి వచ్చే వరకూ వెయిట్ చేద్దామని అనుకున్నారట. కానీ, అన్నకు అధిష్టానం హ్యాండ్ ఇవ్వడంతో.. ఇక కాంగ్రెస్‌కు బై బై చెప్పే టైమ్ వచ్చేసిందని భావిస్తున్నారు. అంతలోనే ఈటల రాజేందర్ బీజేపీలో చేరి ఉప ఎన్నికకు వెళ్లడంతో.. బీజేపీ ప్రభావం ఏ మేరకు ఉందో అంచనా వేసుకోవచ్చని హుజురాబాద్ ఎలక్షన్ వరకూ ఆగారని తెలుస్తోంది. ఉప పోరులో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఇక త్వరలోనే రాజగోపాల్‌రెడ్డి కాషాయ కండువా కప్పేసుకుంటారని అంటున్నారు.
తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు నల్గొండ జిల్లాలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో RRRతో పాటు RRRRలు వచ్చే ఛాన్స్ ఉందంటూ కామెంట్ చేసి పరోక్షంగా రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే హింట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి.. మునుగోడు నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు. ఈ విషయం గురించి విన్నవారంతా.. మా ప్రాంతానికి ఉప ఎన్నిక రాబోతోందోచ్ అంటూ పండగ చేసుకుంటున్నారు.